సినిమాల్లో సంగీత దర్శకుడి పాత్ర చాలా కీలకం సంగీత దర్శకుడు ఎంత సమర్ధవంతంగా ఉంటే సినిమా అదే స్తాయిలో ఉంటుంది అనేది వాస్తవం. అది ఏ హీరో సినిమా అయినా సరే సంగీతం సరిగా ఉంటేనే సినిమా అనేది అందంగా ఉంటుంది. ప్రతీ సీన్ ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక ఇళయరాజా విషయానికి వస్తే ఆయన సినిమా చేస్తున్నారు అంటే దర్శక నిర్మాతలు ఆయన సంగీతం కోసం సీన్ లు రాసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఆయన సంగీతం కోసం ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి మంచి సీన్ పెట్టే ప్రయత్నం చేసే వారట. 

 

ఇది చాలా మందికి అప్పట్లో ఆశ్చర్యంగా ఉండేది. రజని కాంత్ సినిమా అయినా కమల్ హాసన్ సినిమా అయిన ఎవరి సినిమా  అయినా సరే ఇదే విధంగా  ఉంటుంది అని అంటారు. ఎందుకంటే ఆ ఒక్క సీన్ లో సంగీతం ఉంటే చాలు దాని ప్రభావం సినిమా అంతా ఉంటుంది అనే భావన లో అప్పటి దర్శకులు నిర్మాతలు ఎక్కువగా ఉండే వారట. అందుకే ఆయన తో సినిమా చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి చేస్తూ ఉంటారట. ఆయన సంగీతం తగిన విధంగా సినిమా ఉండాలి అనే భావన చాలా మందికి ఉండేది అని అందుకే చాలా వరకు ఆయన స్థాయిని అందుకోవడానికి కష్టపడుతూ ఉంటారు అని అంటారు. 

 

ఇక ఆయన తో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు. ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా కొన్ని కొన్ని సన్నివేశాలు ఉండాలి. అందుకే చాలా మంది దర్శకులు ఆయనను సినిమా కోసం తీసుకునే సమయంలో చాలా వరకు ఆలోచించి అప్పుడు అడుగు వేసే వారట. అదే ఒక సంచలనం.

మరింత సమాచారం తెలుసుకోండి: