సాధారణంగా సినిమాల్లో ఉండే వారు భార్యలకు విలువ ఇవ్వరు అని అంటూ ఉంటారు. వాస్తవ౦ కొంచెం తెలిస్తే మీడియా దానికి ఇంకాస్త జోడించి రాస్తూ జనాలకు కావాల్సిన వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. ఏ సినిమా అయినా ఏ ఒక్కటి అయినా సరే భార్యలకు చెప్పకుండా చాలా మంది చేస్తూ ఉంటారు. వారికి అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అనేది చాలా మంది భావన. అగ్ర హీరోలు అయినా అగ్ర సంగీత దర్శకులు అయినా అగ్ర నటులు అయినా ఎవరు అయినా సరే ఇదే ఆలోచనలో ఉంటూ ఉంటారు. అయితే సంగీత దర్శకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఇళయరాజా విషయంలో అలాంటిది ఉండదట. 

 

ఆయన ఏ విషయం అయినా సరే ముందు భార్యకు చెప్తారట. ఆమెకు అన్ని విషయాలు చెప్పిన తర్వాతనే ఆయన సినిమాలు చేస్తారు అని ఆమె సలహాలు ఎక్కువగా తీసుకుంటారు అని ఇక ఆర్ధిక వ్యవహారాలూ కూడా ఆమె ఎప్పుడు పట్టించుకుంటూ ఉంటారు అని అంటారు. ఆమెకు అన్ని విషయాలు చెప్పడమే కాదు ఆమె కావాల్సిన ప్రతీ ఒక్కటి కూడా ఆయన దగ్గర ఉండి చూస్తారు అని ఏది అయినా కార్యక్రమం జరిగితే ఆమె లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళే వారు కాదు అనేది చాలా మంది చెప్పే మాట. అందుకే ఆయనకు ఏదైనా ఆహ్వానం ఇవ్వాలి అంటే ముందు ఆయన భార్యకు కూడా ఇస్తారు అని అంటారు. 

 

ఇద్దరినీ కలిసి రావాలి అని చెప్తారు అని అది ఆయనలో ఉన్న ప్రత్యేకత అని చాలా మంది అంటూ ఉంటారు. ఆయనను చాలా మంది ఆదర్శంగా తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణం అని అంటారు సినీ జనాలు. భార్య అంటే ఆయన కు చాలా గౌరవం తో పాటు ఇష్టం అని అందుకే ప్రాధాన్యత ఇస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: