ఒకరు ఏమో సూపర్ సినిమా డైరెక్టర్.. మరొకరు ఏమో సూపర్ మ్యూజిక్ డైరెక్టర్.. అప్పటివరకు.. కాదు కాదు మరో పదేళ్ల ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యి మంచి బోల్డ్ లవ్ స్టోరీస్ తో సినిమాలు తీస్తాడు. ఇంకొకరు.. అప్పటి వరకు ఎవరు ఉపయోగించని ఇంస్ట్రుమెంట్స్ తో మ్యూజిక్ కంపోజ్ చేసి ఎవర్ గ్రీన్ సంగీతాన్ని అందిస్తారు ఇళయరాజా. 

 

ఇద్దరు సపరేట్ గా ఎన్ని సినిమాలు చేసిన.. అవి ఎంత అద్భుతంగా ఉన్న.. ఇద్దరు కలిసి చేసిన సినిమాలు ఎవర్ గ్రీన్ అంతే.. అలాంటి ఎవర్ గ్రీన్ సినిమాలు ఏవో ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకోండి.

 

మౌనరాగం.. 

 

రాజా రాణి, నిన్ను కోరి లాంటి అద్భుతమైన సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి కానీ 1986లో వచ్చిన మొదటి సినిమా ఇదే.. ఎంతైనా మణిరత్నం కదా! ఫాస్ట్ ఫార్వర్డ్ మరి.. ఇంకా అలా వచ్చిన ఈ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించారు.. ఆ సినిమా చిన్ని చిన్ని సాంగ్ అయితే సూపర్ హిట్. ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికి ఎక్కడో ఓ చోటా వినిపిస్తూనే ఉంటాయి. 

 

ఘర్షణ.. 

 

సవతి కొడుకుల మధ్య నడిచే సినిమా ఘర్షణ.. ఇంకా ఈ సినిమాలో అయితే అన్ని పాత్రలు చాలా కన్వీన్సింగ్ గా ఉంటాయి. రాజాధి రాజా సాంగ్ అయితే యూత్ ని ఆకట్టుకుంటుంది.. ఇంకా నిన్ను కోరి సినిమా సాంగ్ అయితే ఎవర్ గ్రీన్ సాంగ్. 

 

అంజలి.. 

 

ఆడుకోవాల్సిన వయసులో చిన్నపాపకు క్యాన్సర్ రావడం.. తల్లి తండ్రులు, చెల్లి ఎలా ఉంటారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇంకా ఈ సినిమాలో బేబీ షామిలి యాక్టింగ్, డ్యాన్సింగ్ అదుర్స్ అంతే. అంజలి అంజలి అనే సాంగ్ లోని క్యూట్ నెస్ ఎవర్ గ్రీన్ అంతే. 

 

నాయకుడు.. 

 

సినిమా గురించి ఎవరు చెప్పలేరు.. ఎందుకంటే ఈ స్టోరీ అంత అందంగా అద్భుతంగా ఉంటుంది. కమల్ హాసన్ ఈ సినిమాలో జీవించాడు అంతే. ఈ మూవీలో నీ గూడు చెదిరింది అనే సాంగ్ సూపర్ హిట్ అంతే. 

 

దళపతి.. 

 

సినిమా కథ ఎంత అద్భుతమే సాంగ్స్ కూడా అంతే అద్భుతం.  మణిరత్నం-ఇళయరాజా కంబినేషన్ లో వచ్చిన ది బెస్ట్ సినిమా ఇది. ఈ సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ అంతే. 

 

గీతాంజలి.. 

 

అప్పటి వరకు ప్రేమ కథలను చాలామంది తీశారు.. కానీ త్వరలో చనిపోయే ఇద్దరి మధ్యలో ఓ ప్రేమ కథని రాయడం ఆ మూవీ డైరెక్ట్ చేసిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ అంతే. ఈ మూవీ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ ఏ.. మళ్లీ మళ్లీ వినాలి అని అనిపించే అద్భుతమైన సాంగ్స్ ఇవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: