ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజీషన్కు  చేరుకున్న సంగీత దర్శకుడు ఇసై జ్ఞాని ఇళయరాజా. తమిళనాట సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు ఇళయరాజా. వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం అందించిన ఇళయరాజా జాతీయ అవార్డులను సైతం సాధించాడు. అయితే ఆయన మాత్రం రెండు సార్లు జాతీయ అవార్డు ను తిరస్కరించాడు.

 

తన వెయ్యో సినిమాగా తెరకెక్కిన తారై తప్పట్టై సినిమా కు గాను ఉత్తమ నేపథ్య సంగీతం కేటగిరి లో ఇళయరాజా కు జాతీయ అవార్డు ను ప్రకటించారు. అయితే ఈ అవార్డు ను తీసుకునేందుకు ఆయన నిరాకరించాడు. 63 వ జాతీయ అవార్డు ల కార్యక్రమం లో ఆయనకు ఉత్తమ నేపథ్య సంగీతం కేటగిరిలో ఆయనకు  అవార్డు ను ప్రకటించారు.

 

అయితే ఆ అవార్డును తీసుకునేందుకు ఆయన నిరాకరించాడు. సంగీతం కేటగిరి లో ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య సంగీతం కేటగిరిల్లో అవార్డులు ప్రకటించగా నేపథ్య సంగీతానికి మాత్రమే ఇళయరాజా కు అవార్డును ప్రకటించటం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సంగీతంలో సగం మాత్రమే సక్సెస్‌ అయ్యానా అంటూ ఆ అవార్డును తీసుకునేందుకు ఆయన నిరాకరించారు.

 

అంతేకాదు ఈ వివాదం పై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించారు. ఇన్ఫర్మేషన్‌ బ్రాడ్‌ కాస్ట్ మినిస్టరీ ని సంప్రదించిన ఆయన నేషనల్‌ అవార్డ్స్ జ్యూరీలో సంగీత దర్శకుడికి కూడా స్ధానం కల్పించాలని ఆయన కోరారు. అంతేీకాదు తరువాత హక్కుల విషయంలోనూ ఆయన ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తను కంపోజ్ చేసిన పాటలను గాయకులు స్టేజ్‌ షోలలో పాడ వద్దని నోటీసులు కూడా జారీ చేశాడు ఇళయరాజా.

మరింత సమాచారం తెలుసుకోండి: