టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో తేజా ఒకరు. ప్రేమకథలు స్పెషలిస్ట్ గా కొన్నాళ్ళు సూపర్ హిట్లు తీసిన తేజా ఆమధ్య కెరియర్ లో చాలా వెనుకపడ్డారు. రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారు తేజా. ఆ తర్వాత సీత సినిమా చేయగా అది నిరాశపరిచింది. ప్రస్తుతం రానా, గోపీచంద్ లతో సినిమాలు చేస్తున్న తేజా ఒక సినిమాలో అనుష్కని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట.

 

తేజా డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా అలివేలు వెంకటరమణ సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమాలో ముందు కాజల్ ను హీరోయిన్ గా అనుకోగా ఆమె ఎందుకో ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని తెలుస్తుంది. అందుకే ఆమె ప్లేస్ లో స్వీటీ అనుష్కని తీసుకోవాలని చూస్తున్నారట. లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి అనుష్క కూడా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు గోపీచంద్ తో ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన అనుష్క ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ చేయాలని అనుకుంటుంది. 

 

గోపీచంద్, అనుష్క ఇద్దరిది క్రేజీ పెయిర్. అప్పట్లో ఈ ఇద్దరు మధ్య కూడా సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. గోపిచంద్ తర్వాత అనుష్క ప్రభాస్ తో వరుస సినిమాలు చేయడంతో ప్రభాస్ తో ఆమెకి లింక్ పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే సెలెక్టెడ్ సినిమాలనే చేస్తున్న అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం సినిమా చేయగా తమిళంలో ఒక ప్రాజెక్ట్ కు సైన్ చేసిందని తెలుస్తుంది. తేజా డైరక్షన్ లో అనుష్క సినిమా అంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. మరి అలివేలు వెంకటరమణ ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో చూడాలి. ఈ సినిమా కథ చాలా పర్ఫెక్ట్ గా వచ్చినట్టు చెబుతున్నారు తేజ అండ్ టీం.     

మరింత సమాచారం తెలుసుకోండి: