ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈరోజు తన 77వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తాను కంపోజ్ చేసిన అద్భుతమైన పాటలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 1981వ సంవత్సరంలో విడుదలైన సీతాకోక చిత్రంలోని మాటే మంత్రము పాట ఇళయరాజా ఉత్తమ పాటల్లో ఎప్పుడు ఒకటిగా నిలుస్తుంది. 1982 వ సంవత్సరం లో విడుదలయిన నిరీక్షణ సినిమాలోని ఆకాశం ఏనాటిదో పాటు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పాటగా నిలుస్తుంది. జయప్రద హీరోయిన్ గా నటించిన సాగర సంగమం చిత్రంలో మౌనమేలనోయి ఈ మరపురాని రేయి పాట ఇళయరాజా ఉత్తమ పాటలు ఎప్పుడు ఒకటిగా నిలుస్తుంది. 


కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమాలో ఇళయరాజా కంపోజ్ చేసిన అన్ని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనసు పలికే మౌన రాగం, సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాటలు మనసుని నేరుగా తాకుతాయి. నట సామ్రాట్ అక్కినేని నాగార్జున నటించిన గీతాంజలి సినిమాలో ఆమని పాడవే కోయిల, ఓహ్ ప్రియ ప్రియా పాటలకు కూడా ఇళయరాజా సంగీత బాణీలను అందించాడు. నిజానికి ఈ పాటలో ఎంత బాగుంటాయో అంటే ఒక్కసారి అంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. గీతాంజలి చిత్రం హిట్ కావడానికి ఇళయరాజా మ్యూజిక్ ఎంతగానో ఉపయోగపడింది. 


చిరంజీవి హీరోగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో అందాలలో అహో మహోదయం అంటూ శ్రీదేవి కి తగ్గట్టుగా పాటని రూపొందించి అందరి ప్రశంసలను పొందాడు రాశాను. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భైరవద్వీపం చిత్రం లోని జాణవులే నెరజాణవులే పాట అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ హిట్ గా నిలిచింది. 1998 వ సంవత్సరంలో విడుదలైన అనంతపురం సినిమాలో అసల్లేం గుర్తుకురాదు అనే రొమాంటిక్ సాంగ్ ఆ ఏడాదిలో వచ్చిన పాటల్లో ఉత్తమ పాటగా నిలిచింది. వాస్తవానికి ఈ పాట లక్షల మంది ఆడవారికి ఫేవరెట్ గా నిలిచింది. 2008వ సంవత్సరంలో విడుదలైన అనుమానాస్పదం సినిమాలో ప్రతి దినం నీ దర్శనం పాట చక్కనైన లిరిక్స్ తో అద్భుతమైన కంపోజిషన్ తో ఇళయరాజా హిట్స్ లో చోటు సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: