పవన్ కళ్యాణ్ ప్రతి హిట్ సినిమాలో అలీ సైడ్ హీరో క్యారెక్టర్ లో నటిస్తుంటాడు. అలీ లేనిదే తను సినిమాలు తీయాలని పవన్ కళ్యాణ్ ఒకానొక సందర్భంలో చెప్పినట్టు గుర్తు. దీన్ని బట్టి చూస్తుంటే సినిమాల పుణ్యమా అంటూ వీళ్లిద్దరు ఎంతో మంచి స్నేహితులయ్యారని తెలుస్తుంది. అయితే వీరిద్దరి స్నేహం రాజకీయాల కారణంగా బలహీనపడుతుంది. కమెడియన్ అలీ వేరొక పార్టీకి మద్దతు ఇస్తూ... జనసేన పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం పవన్ కి కోపం తెప్పించినట్టుంది. అందుకే అలీ లేకుండానే తాను సినిమాలు తీస్తున్నాడు. వారిద్దరి మధ్య ఒకానొక సందర్భంలో మాటల యుద్ధం కూడా నడిచింది.


నిజానికి అలీ పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు వారిరువురూ తమ పొలాల్లో పండిన పంటను ఒకరి ఇంటికి మరొకరు పంపించుకునేవారు. ప్రతి వేసవి కాలం పవన్ కళ్యాణ్ తన తోటలో పండిన మామిడి పండ్లను తన బంధు మిత్రులకు పంపించేవారు. ముఖ్యంగా ఆలీకి చాలా తట్టల మామిడికాయలు పంపించేవారు. దానికి బదులుగా కమెడియన్ అలీ పొలాల్లో పండిన కాయగూరలను పవన్ కళ్యాణ్ కి పంపించేవారు. 

IHG
కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ అలీ కి మామిడి కాయలు పంపించాలేదట. ఈ విషయాన్ని సాక్షాత్తు కమెడియన్ ఆలీ ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ... మామిడికాయలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపించడం అనేది కాస్త రిస్క్ తో కూడిన వ్యవహారమే. పవన్ కళ్యాణ్ మాత్రం తన సన్నిహితులకు ప్రతి సంవత్సరం లాగానే మామిడికాయలు పంపించాడట. కానీ తనకు మాత్రం పవన్ ఈసారి మామిడిపండ్లు పంపించలేదట. వచ్చే ఏడాది అయినా మామిడి పండ్లు పవన్ కళ్యాణ్ పంపిస్తారెమో అని అలీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: