ఇళయరాజా సంగీతం ఈ తరానికి పెద్దగా తెలియదు ఏమో గాని కిందటి తరం మాత్రం ఆయన సంగీతం అంటే చెవులు కోసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఇక ఆయన సంగీతం లేని సినిమా అనేది చాలా రోజులు లేదు. ఆ విధంగా ఆయన తన సంగీతాన్ని ప్రేక్షకులకు అందించారు. అగ్ర హీరోల సినిమాలు అంటే కచ్చితంగా ఆయన సంగీతం ఉంటుంది. ఆయన సంగీతం కోసం అగ్ర హీరోలు చాలా వరకు పోటీ పడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆయన డేట్స్ కోసం సినిమాలను కూడా ఆపుకున్నారు కొందరు హీరోలు అంటూ ఉంటారు. 

 

రజని కాంత్ కమల్ హాసన్ అజిత్ కి ఆయన సంగీతం అంటే ఒక పిచ్చి అని అంటూ ఉంటారు. ఆ విధంగా ఆయన సంగీతం వారిని మెప్పించింది. ఇక ఆయన సంగీతంలో చాలా వరకు కూడా అందమైన భావాలు కనపడుతూ ఉంటాయి అని, నటి ఫెయిల్ అయినా సరే ఆయన సంగీతం సన్నివేశాన్ని ఒక రేంజ్ లో లేపుతూ ఉంటుంది అని అంటారు. ఇక అది అలా ఉంటే సిఎన్ఎన్ ఒక సర్వే చేసింది. 49 శాతం మంది ప్రజలు ఆయన సంగీతాన్ని ఇష్టపడతారు అని చెప్పింది సదరు సర్వే. ఆయన సంగీతం కోసం తాము ఎదురు చూస్తామని చెప్పింది ఆ సర్వే. 

 

దీనితో ఆ సర్వే ఫలితం చూసి న్యూస్ ఛానల్ కూడా షాక్ అయింది అని అంటారు. ఇక ఆ ఛానల్ సీఈఓ కూడా ఆయన సంగీతం సీడీ లను భారత్ నుంచి తన వద్దకు తెప్పించుకున్నారు అని అంటారు. ఆ విధంగా ఆయన సంగీతం ప్రపంచ వ్యాప్తం గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రతీ సినిమాలో కూడా ఆయన సంగీతం ఉండేది అప్పట్లో అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: