ఇళయరాజా... బహుశా ఈ తరానికి ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా సరే కిందటి తరానికి ఈ పేరు ఒక ఊపు. ఆయన సంగీతం అనగానే చాలా మంది పనులు మానుకుని మరీ వినే పరిస్థితి ఉండేది. ఆయన సంగీతం వినడానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆయన సంగీతం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చాలా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్వరపరిచిన గీతాలు ఇప్పటికి కూడా విదేశాల్లో వినపడుతూనే ఉంటాయి అనేది వాస్తవం. ఇక ఆయన సంగీతాన్ని దేశాధ్యక్షులు కూడా వినే వారట.

 

ఆయన సంగీతం బిల్ క్లింటన్ కూడా కొన్ని సందర్భాల్లో వినే వారు అని చెప్తూ ఉంటారు. అలాగే శ్రీలంక మాజీ అధ్యక్షుడు గా ఉన్న మహింద రాజపక్సే కూడా ఆయన సంగీతం మీద ఎక్కువగా ఆసక్తి చూపించే వారట. తమిళుల మీద ఆయనకు కోపం ఉన్నా సరే ఇళయరాజా సంగీతం వినడానికి ఆయన ప్రత్యేకంగా భారత్ నుంచి సీడీ లు కూడా తెప్పించుకున్నారు అని చెప్తూ ఉంటారు. ఆయన కోసం ఇండియా నుంచి చాలా మంది ఇళయరాజా సంగీతం కి సంబంధించిన సీడీలను తీసుకుని వెళ్ళే వారు అని చెప్తూ ఉంటారు. అంతే కాకుండా... 

 

ఆయన సంగీత లండన్ లో కూడా ఎక్కువగా వినే వారు. అమెరికాలో కూడా ఆయన సంగీతానికి మంచి డిమాండ్ అనేది ఉండేది. ఈ విధంగా ఆయన సంగీతం ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆయన సంగీతం భారత్ పర్యటనకు వచ్చే క్రికెట్ ఆటగాళ్ళు కూడా వినే వారు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన సంగీతం పాపులర్ అయింది అని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా ఆయనకు అదే స్థాయిలో క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: