సాధారణంగా పల్లె పాటల్లో ఉండే అందం అనేది చాలా మందికి తెలియదు. పాటలు ఎంతో అందంగా ఉంటాయి అలాగే సంగీతం కూడా మనసుకి దగ్గర అయ్యే విధంగా ఉంటుంది అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఒక్కటి కూడా పల్లె పాటలు అందరికి నచ్చుతూ ఉంటాయి. అయితే అవి సినిమాల్లోకి వచ్చేసరికి మాత్రం అంతగా ఆకట్టుకునే అవకాశం ఉండదు. వాటిని ఆల్బం గా వినడానికి మాత్రమే చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే పల్లె పాటలను ఇళయరాజా అందించిన విధానం మాత్రం చాలా బాగా ఆకట్టుకుంది ప్రపంచాన్ని. 

 

తెలుగు అయినా తమిళం అయినా మరో భాష అయినా సరే ఆయన పల్లె పాటలకు చాలా అందం జోడించారు. సంగీతానికి వాటిని సరికొత్తగా పరిచయం చేసారు అనేది వాస్తవం. ఆయన ఏ సినిమా ఏ పల్లె పాట చేసిన ఆది ఏ భాష అయినా సరే దాని స్థాయి మరో రేంజ్ లో ఉంటుంది అనే మాట అక్షరాలా నిజం. లిరిక్స్ ఎలా అయినా ఉండనివ్వు... ఆయన పాట కు సంగీతం అందిస్తున్నారు అంటే చాలు అవసరం అనుకుంటే లిరిక్స్ ని కూడా రచయితలు మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఆయన పాటలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. 

 

చాలా సినిమాల్లో ఆయన పల్లె పాటలను ప్రేక్షకులకు అందించారు. ఆ విధంగా ప్రేక్షకులకు ఆ పాటలు నచ్చాయి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంగీతానికి కొత్త అర్ధాలను ఆయన తన సంగీతం లో అందించారు. అందుకే ఆయన పాటలకు ఆ స్థాయిలో క్రేజ్ ఉంటుంది అని అంటూ ఉంటారు ప్రేక్షకులు. ప్రతీ సినిమాలో కూడా  పాటకు చాలా అందం జోడించే వారు. ఆయన సంగీతం కోసం స్పాట్ లు వెతుక్కుని షూట్ లు చేసుకునే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: