సంగీతంతో రాళ్ల అయినా కరిగిపోతూ ఉంటాయి అని అంటూ ఉంటారు.... ఇళయరాజా సంగీతం వింటుంటే నిజంగా ఇది నిజమేనేమో అనిపిస్తూంది. అంత గొప్పగా  సంగీత ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి ఇళయరాజా అందించిన పాటలు. సంగీతానికి కొత్త వొరవడి తొక్కించిన  గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా. మాస్ మసాలా సంగీతం నుంచి... వినసొంపైన సంగీతానికి తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకు వచ్చిన గొప్ప స్వరకర్త ఇళయరాజా. 40 సంవత్సరాల పాటు సంగీత అనుభవంగల ఇళయరాజా... ఎంతో గొప్ప సంగీత దర్శకుల జాబితాలో మొదటి స్థానంలో ఉంటారు. ఈయన  అందించిన పాటలు ఎన్నో మైలురాళ్లు గా నిలిచి పోయాయి. నాటి తరం ప్రేక్షకుల నుంచి నేటి తరం ప్రేక్షకుల వరకు అందరినీ అలరిస్తూ ఉన్నాయి. 

 


 ఇళయరాజా తన నలభై సంవత్సరాల వృత్తి జీవితంలో ఇప్పటివరకు ఐదు వేల పాటలకు  స్వరాలు సమకూర్చారు... 1000 సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా. సంగీతంలో ఇళయరాజా చేసిన సేవలకు గాను  2010లో పద్మభూషణ్.. 2018లో పద్మ విభూషణ్ అవార్డులను అందించి ప్రభుత్వాలు  సత్కరించాయి. ఇక సంగీత దర్శకుడిగా ఆయన ఏకంగా 5 జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. శ్రీరామరాజ్యం రుద్రమదేవి ధోని లాంటి సినిమాలకు కూడా సంగీతదర్శకుడిగా పని చేసి నేటి తరం ప్రేక్షకులను కూడా ఆకర్షించారు ఇళయరాజా. ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా ప్రస్తుతం గొప్ప సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. 

 


 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇళయరాజా ఎన్నో మైలురాళ్లను పాటలను అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బలపం పట్టి భామ ఒళ్ళో అ  ఆ ఇ ఈ నేర్చుకుంటా అంటూ సాగిపోయే సాంగ్ ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఫేవరెట్ గా మారిపోతూ ఉంటుంది. ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినసొంపుగానే ఉంటుంది. ఇక విజువల్గా చూస్తే మరింత అద్భుతంగా ఉంటుంది ఈ పాట. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఇళయరాజా... సరికొత్త బాణీలను అందించి బలపం పట్టి భామ బళ్ళో అనే పాటను తెలుగు ప్రేక్షకులకు అందించగా... సంగీత ప్రేక్షకులను ఈ పాట ఎంతగానో ఉర్రూతలూగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: