తన మొట్ట మొదటి సినిమాలోనే బాలీవుడ్ బాద్ షా సల్మాన్ ఖాన్ తో నటించి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ని సంపాదించింది సోనాక్షి సిన్హా. దబాంగ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చిత్రాల్లో సల్మాన్ ఖాన్ సరసన రాజ్జో పాండి పాత్రలో నటించిన సోనాక్షి సిన్హా డీసెంట్ ప్రేక్షకులను కూడా బాగా అలరించింది. అక్షయ్ కుమార్ సరసన విక్రమార్కుడు రీమేక్ చిత్రమైన రౌడీ రాథోడ్ హిందీ చిత్రంలో సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించి అందరి ప్రశంసలను అందుకుంది. 


ఆర్.... రాజ్ కుమార్, అకీరా, మిషన్ మంగళ్ లాంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. అయితే ఈ ముద్దుగుమ్మ పాట్నా లో 1987 జూన్ 2వ తేదీన షత్రుఘన్ సిన్హా, పూనమ్ సిన్హా దంపతులకు జన్మించింది. ఈరోజు అనగా జూన్ 2వ తేదీన తన 33 వ పుట్టిన రోజు వేడుకలను ఇంటి దగ్గర తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటుంది. 

IHG
నటీమణి సోనాక్షి తన తల్లి పూనమ్ సిన్హాతో బాగా క్లోజ్ గా ఉంటుంది. బయటకు వెళ్లినా తన తల్లితోనే వెళ్తుంది. ఇప్పటికే వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో సార్లు బయట ప్రదేశాల్లో కనిపించారు. తన తల్లి తన మంచి ఫ్రెండ్ అని సోనాక్షి సిన్హా అనేక సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

IHG'development of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GIRL' target='_blank' title='girl-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>girl</a> child' with support ...
తన కుటుంబానికి సంబంధించిన అనేక చిత్రాలను సోనాక్షి సిన్హా సోషల్ మీడియా వేదికగా చేసుకుంది. తన తండ్రి అయిన షత్రుఘన్ సిన్హా తో చిన్నప్పుడు దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకొని బర్తడే విషెస్ చెప్పింది సోనాక్షి. ప్రస్తుతం సోనాక్షి సిన్హా అజయ్ దేవగన్ సరసన భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: