తెలంగాణ దశాబ్దాల కల నెరవేరిన రోజు.... ఎంతోమంది ప్రాణ త్యాగాలకు ఫలితం దక్కిన రోజు.... దశాబ్దాల నుంచి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ... దృఢ సంకల్పంతో ముందుకు సాగిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనె  ఒక బక్కపలచని మనిషి ధైర్యానికి  కేంద్రం తలొగ్గిన రోజు... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. తెలంగాణ ప్రజలందరికీ కల సాకారమైన రోజు ఈ రోజు. దీంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఘనం గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో మంది వీరులు అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ... తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు తెలంగాణ ప్రజానీకం. 

 


 అమర వీరులకు నివాళులు అర్పిస్తూ... వారి త్యాగాల ఫలితమే నేడు తెలంగాణ అని చాటి చెబుతున్నారు ఎంతోమంది. ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమ  నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రజానీకానికి మొత్తం ఎంతో మంది ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. 

 

 నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు త్యాగాలను కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావ సంబరాలను ఘనంగా జరుపుకున్న తెలంగాణ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం... తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ అమరవీరుల స్మృతి కి నివాళులర్పిస్తున్న అంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: