పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాల కోసం అతను ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడి ఆలోచకు తగిన విధంగా నటించే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నాడు అని అంటున్నారు. ఈ సినిమాలో ఇప్పుడు అతని పాత్రకు సంబంధించి కొన్ని మార్పులను చిత్ర యూనిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అతనికి ముందు ఈ సినిమాలో కన్ను ఒకటి కనపడే అవకాశం ఉండదు అని అనుకున్నారు. అలాగే అతను నటిస్తాడు అని భావించారు. 

 

ఇక ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. సినిమాలో అతని పాత్రకు సంబంధించి కొన్ని కఠిన సన్నివేశాల్లో నటించాలి అని సమాచారం. ఆ కఠిన సన్నివేశాల్లో అతని ఒంటి మీద షర్టు ఉండదు అని దాని తోనే అతను ఒక దుంగ ను ఒంటి మీద పెట్టుకుని పరుగులు తీసే అవకాశం ఉందని సమాచారం.. ఆ విధంగా కథను మారుస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా అడవి లోనే ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆమె పాత్ర విషయంలో ఇప్పటికే దర్శకుడి వద్ద ఒక ఆలోచన ఉందని మరి ఆమె నటించే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. 

 

సినిమా కోసం హీరోయిన్ రష్మిక మందన నటనకు సంబంధించిన క్లాసులు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది అని తెలుస్తుంది. మరి ఆమె పాత్ర ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ సినిమా వచ్చే ఏడాది దసరా కు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి. ఈ సినిమాలో విజయశాంతి కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: