కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు తమ అనుభవాలను ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్‌ కూడా భవిష్యత్తు మీద ఆశలు కలిగేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఓ బ్లాక్ అండ్ వైట్‌ ఫోటోను షేర్ చేసిన కాజోల్ భవిష్యత్తు ఎంతో దూరంలో లేదు, కానీ జీవిత కాలం పట్టేలాగా ఉంది` అంటూ కామెంట్ చేసింది.

 

ఒకే పోస్ట్‌ లో భవిష్యత్తు మీద ఆశను, అదే సమయంలో నిరుత్సాహాన్ని చూపిస్తూ కాజోల్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల లాక్‌ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న కాజోల్‌ వరుసగా సెల్పీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అంతేకాదు తన చిత్రాల్లోని వర్కింగ్ స్టిల్స్‌ను వీడియోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది కాజోల్‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Looking at the future which isn't so far away really, but seems like a lifetime. #breathclean #nonpolluted

A post shared by kajol Devgan (@kajol) on

మరింత సమాచారం తెలుసుకోండి: