టాలీవుడ్ లో ఈ తరంలో ప్రయోగాలు చేసే విషయంలో రామ్ చరణ్ అందరి కంటే దూకుడుగా ఉంటాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమాలు అన్నీ కూడా చూస్తే మనకు ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అగ్ర హీరోలు ఎవరూ కూడా ఈ తరుణంలో సినిమాలు చెయ్యాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్న తరుణంలో రామ్ చరణ్ మాత్రం వరుసగా ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రతీ విషయంలో కూడా అతను సాహసోపెతంగానే ఆలోచిస్తున్నాడు. 

 

ధ్రువ సినిమా సినిమా అతనికి మంచి విజయం ఇచ్చిన ఈ సినిమా తర్వాత అతను రంగస్థలం సినిమాలో నటించాడు. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా తర్వాత చేసిన వినయ విదేయ రామా సినిమా షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా కీలకం. ఇక అది పక్కన పెడితే తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక భారీ ప్రాజెక్ట్ ని అతను తెలుగులోకి భారీ బడ్జెట్ తో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

నిజమా కాదా అనేది తెలియదు గాని అతను మాత్రం ఇప్పుడు ఒక నిర్మాతతో దీనికి సంబంధించి చర్చలు కూడా జరుపుతున్నాడు అని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరో గా తాను కాదని మరో హీరోని తీసుకుని సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళాలి అని అతను భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఆ సినిమా ఎంత వరకు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: