2019ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో కనీవినీ ఎరుగని పరాజయం పొందిన టిడిపి పార్టీ పేరు ప్రఖ్యాతలు అన్నీ హరించుకుపోయాయి. అయితే పార్టీ మళ్లీ గాడిలో పడేందుకు చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నాడని ఎన్నో వార్తలు వచ్చాయి. అమరావతి రైతుల దీక్షల్లో రైతులను పరామర్శించడానికి నారా బ్రాహ్మణి, నారా లోకేష్, తేజస్విని నారా భువనేశ్వరి చంద్రబాబుకు తోడుగా వచ్చారు. ఆ సందర్భంలో నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తారని అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. దీన స్థితిలో ఉన్న టిడిపి పార్టీ ని మళ్ళీ ప్రాణం పోసి బతికించేందుకు నారా బ్రాహ్మణి ఫుల్ టైం రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. 


అయితే తాజాగా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ అనేకమైన విషయాలపై మాట్లాడుతూ తమ అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో కొనసాగితేనే మంచిదని... తారక్ ప్రస్తుతం మంచి సినీ కెరీర్ ని వదిలేసి రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని... తానో తన నాన్న ఎన్టీ రామారావు ఏక కాలంలోనే రాజకీయాల్లో కొనసాగడం వేరని బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. 


అలాగే తన పెద్ద కూతురు అయిన నారా బ్రాహ్మణి టిడిపి పార్టీలో చేరి ఫుల్ టైం పొలిటీషియన్ గా కొనసాగుతారా అని అడిగితే... తన కూతురు బ్రాహ్మణి రాజకీయాల్లోకి అసలు అడుగుపెట్టదని... నిజానికి ఆమెకు రాజకీయాల పై ఎటువంటి ఆసక్తి లేదని బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. రాజకీయ అంశాల గురించి చర్చించడానికే బ్రాహ్మణి అస్సలు ఆసక్తి చూపించదు. ఇప్పట్లో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టదు. ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. నా ఇద్దరు అల్లుళ్లు అయిన నారా లోకేష్, శ్రీ భరత్ లను ప్రతి వీకెండ్ కలుస్తాను. వాళ్లు కూడా బ్రాహ్మణ సమక్షంలో రాజకీయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడరు', అని బాలకృష్ణ వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: