కావాల్సినంత గ్లామర్ ఉంది. కొద్దోగొప్పో అభినయం కూడా ఉంది. అన్నీ ఉన్నా.. ఇప్పట్లో స్టార్ డమ్ రావడం లేదు. వీళ్లకు ఆ క్రేజ్ రాకుండా స్టార్ హీరోలు అడ్డుపడుతున్నారు.

 

ముంబయి నుంచి వచ్చిన నిధి అగర్వాల్ తెలుగులో స్టార్ డమ్ కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తోంది. కెరీర్ మొదట్లో సవ్యసాచి.. మిస్టర్ మజ్ఞు అంటూ ఫ్లాప్స్ రావడంతో డిసప్పాయింట్ అయింది. తెలుగులో అసలు సక్సెస్ వస్తుందా.. అనుకున్న టైమ్ లో ఇస్మార్ట్ శంకర్ హిట్ తీసుకొచ్చింది. దీంతో పెద్ద హీరోలు పిలిచి ఛాన్సులిస్తారని ఆశపడింది నిధి అగర్వాల్. 

 

ఇస్మార్ట్ శంకర్ వచ్చి ఏడాది కావొస్తున్నా.. తెలుగులో స్టార్ హీరో నిధిని కరుణించలేదు. తమిళంలో భూమి.. కన్నడలో జేమ్స్ అనే సినిమా చేస్తోందన్న పేరే గానీ.. తెలుగులో క్రేజీ హీరో పక్కన నటించే ఛాన్స్ దక్కలేదు. స్టార్ ఇమేజ్ వస్తుందన్న నమ్మకం కనిపించలేదు. నిధి ప్రస్తుతం తెలుగులో అశోక్ గల్లా పక్కన నటిస్తోంది. 

 

ఇస్మార్ట్ శంకర్ మరో భామ నభా నటేశ్ హోప్స్ అన్నీ స్టార్ డమ్ పైనే. ఇస్మార్ట్ శంకర్ లో నిధి, నభా రెచ్చిపోయి మరీ గ్లామర్ చూపించారు. సినిమా హిట్ తో తమపై ఉన్న ఐరన్ ముద్ర కూడా చెరిగిపోయింది. పెద్ద హీరోల పక్కన నటించకపోయినా నభ ప్రస్తుంతం సోలో బతుకే సో బెటర్ మూవీలో సాయి ధరమ్ తేజ్ తో.. అల్లుడు అదుర్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో జతకడుతోంది. 

 

మంచి పెర్ ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి స్టార్స్ ను ఆకట్టుకోలేకపోయింది. బన్నీ.. తారక్ కు పోటీగా డ్యాన్స్ వేయగలదు. అభినయంతో మెప్పించగలదు. అన్నీ ఉన్నా.. ఈ హైబ్రిడ్ పిల్లను మన స్టార్ అవాయిడ్ చేస్తున్నారు. 

 

యంగ్ హీరోయిన్స్ కు స్టార్ డమ్ వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. దీనికి కారణం మాత్రం స్టార్ హీరోలే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ పూర్తయ్యే సరికి 2020 వెళ్లిపోతుంది. ఈ లోగా మరో సినిమాకు కమిట్ కాలేరు. అలాగే బన్నీ నటిస్తున్న పుష్పలో రష్మిక హీరోయిన్. ఇంకో ఏడాది వరకు మరో హీరోయిన్ వైపు బన్నీ కన్నెత్తి చూడడు. ప్రభాస్ ప్రస్తుతం పూజా హెగ్డేతో జత కడుతున్నాడు. దీంతో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ యంగ్ హీరోలతో సరిపెట్టుకుంటున్నారు. 

 

సమంత..తమన్నా.. శృతిహాసన్. రకుల్. నిన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీ ఈ నలుగురి చూట్టూ తిరిగింది. మళ్లీ మళ్లీ ఛాన్సులిచ్చిన స్టార్స్ మనసు మార్చుకొని ఫ్రెష్ పెయిర్ కోరుకుంటూ.. కియారా.. రష్మిక లాంటి కొత్త అందాలపై దృష్టిపెట్టారు. దీంతో సమంత, తమన్నా చేతిలో ప్రస్తుతం ఒక్క క్రేజీ హీరో కూడా లేదు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ఉన్నా పెద్ద హీరోలు సంత వైపు చూడటం లేదు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై మొగ్గు చూపుతున్న సామ్స్.. కొత్త ఇమేజ్ కోసం ట్రై చేస్తూ.. స్టార్స్ కు సామ్స్ దూరమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: