తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ దక్షిణాది రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 2005లో వచ్చిన ఈ సినిమాను సినీ ప్రేమికులు అంత తేలిగ్గా మర్చిపోవడం కష్టం. ఓ మాటలో చెప్పాలంటే ఇది రజినీకాంత్ సినిమానే అయినా హిట్ లో క్రెడిట్ అంతా హీరోయిన్ జ్యోతికకే చెందుతుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా ‘చంద్రముఖి2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ కీలకపాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

IHG

 

‘ఈ సినిమాలో నేను నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ సినిమా ఎటువంటి పాత్ర కోసం కూడా నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ విషయంలో నా ఫ్యాన్స్ ను నిరుత్సాహపరుస్తున్నాను. వార్త రాసేముందు ఎవరైనా ఈ విషయంలో క్లారిటీ తీసుకుని రాయండి’ అని క్లారిటీ ఇస్తూనే కాసింత ఘాటుగా సమాధానం చెప్పింది. చంద్రముఖి2లో జ్యోతిక పాత్రను సిమ్రన్ చేస్తుందంటూ ఓ మీడియా జర్నలిస్టు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీంతో సిమ్రన్ జర్నలిస్ట్ ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. దీంతో చంద్రముఖి2లో సిమ్రన్ లేదని అఫిషియల్ గా తేలిపోయింది.

IHG

 

నిజం చెప్పాలంటే సినిమాలో హీరో రజినీకాంతే అయినా హిట్ లో క్రెడిట్ అంతా హీరోయిన్ జ్యోతికకే దక్కింది. తన నటనతో ప్రేక్షకుల్లో భయం పుట్టించింది. ఆస్థాయి నటన కనబరచి తనలోని నటిని బయటకు తీసుకొచ్చింది. సీక్వెల్ లో ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారో క్లారిటీ లేదు. లారెన్స్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మళయాళ నటుడు పృథ్వీ కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. పి.వాసు దర్శకత్వంలోనే రెండో భాగం తెరకెక్కుతూండగా సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: