ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్యాచ్ లో మొన్నటి వరకు రానా ఉన్నాడు. అయితే ఇటీవల తాను ప్రేమలో పడినట్లు ప్రేమించిన అమ్మాయిని సోషల్ మీడియాలో పరిచయం చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. అంతేకాకుండా లాక్ డౌన్ సమయములో రెండు కుటుంబాలకు చెందిన వాళ్లు రోకా వేడుక కూడా చేయడం జరిగింది. త్వరలోనే నిశ్చితార్థం కూడా జరప బోతున్నట్లు సమాచారం.

IHG'I Found ...

ఇదిలా ఉండగా రానా మిహీకాల వివాహం ఆగస్టు నెలలో జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు భయంకరంగా వైరల్ అవుతున్నాయి. మూడు రోజులు ఈ పెళ్లి జరగబోతున్న ట్లు, ఎనిమిదో తారీఖున ముహూర్తం నిర్ణయించినట్లు, తెలుగు సంప్రదాయం తో పాటు మార్వాడి సాంప్రదాయం ప్రకారం జరగనున్నట్లు చెబుతున్నారు. రెండు రకాలుగా రానా మిహీకల పెళ్లి జరగనున్నట్లు వార్తలు కొంతమంది సోషల్ మీడియా వైరల్ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. దీంతో తన కొడుకు పెళ్లి పై హడావిడి చేస్తున్న వారికి గట్టి సమాధానం ఇచ్చారు నిర్మాత సురేష్ బాబు. 

IHG

వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రానా మిహీకల పెళ్లి గురించి ప్రత్యేకంగా ఏ డేట్ అనుకోలేదని అప్పటివరకు ఎటువంటి వార్తలు రాయవద్దు రాసిన నమ్మవద్దు మేమే తేదీని ప్రకటిస్తామని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క రానా లాక్ డౌన్ టైం లో రోకా వేడుక నిర్వహించడంతో ఇండస్ట్రీలో రానా స్నేహితుల నుండి సెటైర్లు పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: