సాయి పల్లవికి మన తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాప చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా ఆమెకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఆమె నటనకు మంచి మార్కులు కూడా పడుతున్నాయి. ఆమె ఏ సినిమాలో చేసినా సరే కచ్చితంగా హీరో ని డామినేట్ చేస్తుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆమె ఇప్పుడు ఏ సినిమా చేసినా సరే కూడా అదే ఆలోచనలో ఉంది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలి అనే విధంగానే ఆమె పని చేస్తుంది అంటున్నారు. 

 

ఇప్పుడు ఆమె సినిమాలలో కాస్త దూకుడుగా నటిస్తుంది. వచ్చే ఏడాది మొత్తం ఆమె సినిమాలు చేస్తుంది. ఇక ఇప్పుడు ఆమెకు తెలుగులో ఆఫర్లు బాగానే వస్తున్నాయి. తాజాగా క్రిష్ పవన్ సినిమాలో ఒక వ్యక్తికి ఆమె కూతురుగా నటించే ఛాన్స్ వచ్చింది అని సమాచారం. ఆ పాత్ర వ్యాపారవేత్త తో పాటుగా విలన్ తో కూడా కలిసి ఉంటుంది అని ఆమె పాత్ర ఆ సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది అని సమాచారం. ఆమె త్వరలోనే ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఆమె అగ్ర హీరోలతో సినిమా ఛాన్స్ లు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె చాలా వరకు కష్టపడుతుంది. ఇక రానా తో ఒక సినిమా నాగ చైతన్యతో ఒక సినిమా ఆమె చేస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది రానున్నాయి. ఇక రామ్ చరణ్ సినిమాలో మహేష్ సినిమాలో కూడా ఆమెకు ఆఫర్లు వచ్చినట్టు సమాచారం. పరుశురాం మహేష్ సినిమా లో ఆమెకు మంచి పాత్ర వచ్చింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: