బాలీవుడ్ లో మెగా హీరోలకు మంచి గుర్తింపు ఉంది. అక్కడ సినిమాలు వాళ్ళు చేసినా లేకపోయినా సరే వాళ్లకు మాత్రం మంచి క్రేజ్ ఉంది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవచ్చు. చిరంజీవి సినిమా అయినా పవన్ కళ్యాణ్ సినిమా అయిన ఇప్పటి రామ్ చరణ్ సినిమా అయినా సరే వాళ్ళు ప్రత్యేకంగా ఆదరిస్తారు అనేది వాస్తవం. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలను అక్కడ డబ్బింగ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చిరంజీవి సినిమాలకు అక్కడ ముందు నుంచి కూడా ప్రత్యేకంగా ఆదరణ అనేది ఉంది. 

 

అది పక్కన పెడితే ఇప్పుడు మెగా హీరోలతో సినిమాలను చేయడానికి గానూ బాలీవుడ్ నిర్మాతలు దర్శకులు చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కోసం ఇప్పుడు బాలీవుడ్ లో ఇద్దరు హీరోల మధ్య పోటీ ఉంది. ఆ సినిమాను నేను చేస్తా అని సల్మాన్ ఖాన్ స్వయంగా అముందుకు రాగా ఇప్పుడు షారుఖ్ కూడా ఆ సినిమాను చేయడానికి ఆసక్తి చూపిస్తున్న వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా అనేది పక్కన పెడితే ఆయన కథ కోసం ఇప్పటికే అల్లు అరవింద్ తో కూడా మాట్లాడారు అనేది చాలా మంది మాట. 

 

అల్లు అరవింద్ మాత్రం తాను అక్కడ అల్లు అర్జున్ తోనే ఆ సినిమాను చేస్తాను అని కూడా చెప్పినట్టు సమాచారం. మరి ఇది నిజమా కాదా అనేది తెలియదు గాని ఇప్పుడు దీనిపై మాత్రం బాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది అక్కడ మొదలయ్యే సూచనలు ఉన్నాయి అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: