దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా "రౌద్రం రణం రుథిరం". డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై  దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత మళ్ళీ రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.   

 

ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే రాం చరణ్ పాత్ర ని రివీల్ చేసి రాజమౌళి బృందం ఆర్.ఆర్.ఆర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ముఖ్యంగా చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు ని రివీల్ చేస్తూ వదిలిన వీడియో టీజర్ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ని తీసుకు వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి మిగిలి ఉన్న డిసప్పాయింట్ మెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్.టి.ఆర్ బర్త్ డే సందర్భంగా మే 20 న కొమరం భీం పాత్రకి సంబంధించిన వీడియో టీజర్ ని రిలీజ్ చేయకపోవడమే. అయితే లాక్ డౌన్ కారణంగా కొమరం భీం పాత్రని రివీల్ చేయలేకపోయిన జక్కన్న మంచి సమయం చూసి ఈ వీడియో టీజర్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

 

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులందరిలో జరుగుతున్న చర్చల ప్రకారం ఆర్.ఆర్.ఆర్ తర్వాత టాలీవుడ్ నుండి మరో ఇద్దరికి పాన్ ఇండియా స్టార్స్ గా బారీ క్రేజ్ రాబోతుందని. ఆర్.ఆర్.ఆర్ తో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల ఇద్దరికి పాన్ ఇండియా స్టార్స్ గా క్రేజ్ రావడమే టార్గెట్ గా జక్కన్న ఈ ఇద్దరిని చెక్కుతున్నారట. మొత్తానికి బాహుబలి ఫ్రాంఛైజీతో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన జక్కన్న ఇప్పుడు తారక్, చరణ్ లను అదే రేంజ్ లో పాన్ ఇండియా స్టార్స్ ని చేయబోతున్నారు. ఇక ప్రభాస్ పక్కన ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ గా నిలబడబోతున్నారు. అయితే ఈ క్రెడిట్ మాత్రం రాజమౌళి కే దక్కుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: