ప్రేక్షకులకు వినోదాన్నిచ్చే సినిమాల్లో కొన్ని అంశాలు అడపాదడపా వివాదాస్పదం అవుతూంటాయి. కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదాలకు గురవుతాయి. దీంతో విడుదల కావటానికే కష్టాలు పడుతాయి. వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ ఇటువంటి వివాదాలకే గురైంది. మొదట ఈ సినిమాకు ‘వాల్మీకి’ అనే టైటిల్ అనుకున్నారు. ప్రమోషన్లు కూడా పూర్తై రేపు సినిమా విడుదల అనగా వివాదం మరింత ముదిరింది. రాత్రికి రాత్రే సినిమా టైటిల్ ను ‘గద్దలకొండ గణేష్’ గా మార్చారు.

IHG

 

‘వాల్మీకి’ టైటిల్ మార్చాలంటూ బోయ సంఘం, వాల్మీకి వ‌ర్గం వారు డిమాండ్ చేశారు. టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారు హైకోర్టుకు వెళ్లారు. అయితే ఈలోపు సినిమా కూడా వాల్మీకి టైటిల్ తోనే సెన్సారయింది. బోర్డు కూడా అభ్యంతరాలు చెప్పకుండా ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారి చేసింది. కానీ.. బోయ‌ సంఘం, వాల్మీకి వ‌ర్గం టైటిల్‌లో తుపాకీ ఉంద‌నే అభ్యంత‌రాన్ని వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్ తుపాకిని తొలగించారు. వాల్మీకి, బోయలను ఎక్కడా తప్పుగా చూపించ లేదని.. వాల్మీకి గొప్పదనాన్ని సినిమాలో అంతర్లీనంగా చూపించామని దర్శకుడు హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. అయినా వివాదం సద్దుమణగ లేదు.

IHG

 

సినిమా ప్రదర్శనను ఆపేయాలంటూ అనంత‌పురం, క‌ర్నూలు జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారి చేసారు. ఈ రెండు జిల్లాలలో బోయ, వాల్మీకి వర్గాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒత్తిడికి యూనిట్ తొలగ్గక తప్పలేదు. వాల్మీకి టైటిల్ ను "గద్దలకొండ గణేష్"గా మారుస్తున్నామని హైకోర్టుకు తెలిపింది. సినిమా ‘గద్దలకొండ గణేష్’ గా విడుదలై మంచి విజయం సాధించింది. 14 రీల్స్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మించారు. 2019 సెప్టెంబర్ 20న ఈ సినిమా విడుదలైంది.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: