టాలీవుడ్ లో వినోదాన్ని అందించే సినిమాలు అంటే అప్పటి అన్నగారు , నాగేశ్వర రావు నటించిన ఆణి ముత్యాల్లాంటి సినిమా లే.. కాస్త చిలిపి తనం , సిగ్గు , కొంటె చూపులు, సరదాలు, సరసాలు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా లకు చక్కటి ఉదాహరణ ఆ సినిమా లే అని చెప్పాలి.. అందుకే ఇప్పుడు చాలా మంది అప్పటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు గుర్తు చేయాలనే ఆలోచన లో ఉన్నారు.. బయోపిక్ ల పేరుతో సినిమాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు..

 

 


కొందరేమో యువతను ఈ తరం అందాల తో ఆకట్టు కోవడానికి ప్రయత్నిస్తున్నారు.. అందుకే ఇప్పుడు హార్రర్ , బోల్డ్ సినిమాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. వాటి లో కొన్ని సినిమాలు యువత ను ఆకర్షించి మంచి హిట్ ను అందుకున్నాయి.  ఇప్పుడు ఆ చెత్త ఎక్కువ గా చూపిస్తూ విమర్శలు కూడా అందుకుంటున్నాయి.. ఉదాహరణ కు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు.. 

 

 

 


ఇది ఇలా ఉండగా తెలుగు వివాదాస్పద దర్శకుడు వర్మ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. అంతగా ఆయన కాంట్రవర్సీ లతో పాపులర్ అయ్యారు.. ఆయన దగ్గర శిష్యరికం నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారట.. అసలు విషయానికొస్తే గతంలో వర్మ తెరకెక్కించిన రంగీలా హాట్ సినిమా ఎంత పాపులర్ అయ్యిందో  తెలిసిన విషయమే.. ఆ సినిమా రొమాంటిక్ ప్రజల మనసును పట్టేసుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ గా వర్మ శిష్యుడు బ్యూటిఫుల్ పేరుతో సినిమాను రూపొందించడం తో పాటుగా బోల్డ్ సీన్లు కాస్త ఎక్కువ ఉండేలా చేశాడు అంతే.. సినిమా టాక్ అటుంచి సినిమాపై విమర్శకులు గుప్పించాడు..వర్మ శిష్యుడు అంటే ఆ మాత్రం ఉండాలిగా అంటూ.మాటలను అందుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: