చరిత్రలో క్రీస్తు పూర్వం క్రీస్తు తరువాత అన్నలెక్కలు ఉన్నట్లుగా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో కూడ కరోనా ముందు సినిమాలు ఒకలాగా కరోనా తరువాత తీస్తున్న సినిమాలు ఒకలాగా మార్పులు చెందుతున్నాయి. గతంలో లా భారీబడ్జెట్ సినిమాల కోసం కోట్లు ఖర్చుపెట్టి భారీ సెట్లు వేసి లోకేషన్స్ కోసం విదేశాలకు వెళ్ళి ఎంత ఖర్చు అయినా పట్టించుకోకుండా భారీ సినిమాలను తీసే పరిస్థితులు కనిపించడంలేదు.


దీనితో సినిమా నిర్మాణంలో అనేక విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. అయితే ఇప్పటికే కరోనా సమస్య ప్రారంభం అవ్వక ముందు ప్రారంభం అయిన భారీ బడ్జెట్ సినిమాలను ఎలా పూర్తి చేయాలో తెలియక దర్శక నిర్మాతలు తల పట్టుకుంటున్నారు. ఈలిస్టులో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రధమ స్థానంలో ఉండటంతో ‘ఆర్ ఆర్ ఆర్’ ను క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గించకుండా ఆసినిమాను అంచనాలకు అనుగుణంగా భారీస్థాయిలో తీయడానికి రాజమౌళి అనేక ఆలోచనలు చేస్తున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ సినిమాల నిర్మాణ విషయంలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం తాను భారీ బడ్జెట్ తో తీస్తున్న పీరియాడికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా నిర్మాణ విషయంలో భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఆసన్నివేశాల చిత్రీకరణ ఆలోచనలను తాను మార్చుకోలేదనీ అయితే వాస్తవంగా అలాంటి సన్నివేశాలు తీయకుండా టెక్నాలజీ సహాయంతో ఈభారీ వార్ సీన్స్ తీసే మార్గాల కోసం తాను విదేశీ నిపుణులతో చర్చిస్తున్న విషయాన్ని బయటపెట్టాడు.


అయితే ఇలా భారీ సినిమాల నిర్మాణంలో టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోవాలి అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందని అందువల్ల టాప్ హీరోలు హీరోయిన్స్ దర్శకులు తమ పారితోషికాలలో కనీసం రెండు సంవత్సరాల పాటు 50 శాతం కోత ఎవరికీ వారు తమకు తామే విధించుకుంటే భారీ బడ్జెట్ సినిమాలు తీయడం పెద్ద కష్టం కాదని మణిరత్నం అభిప్రాయ పడుతున్నాడు. అంతేకాదు ఇండస్ట్రీ వల్ల టాప్ సెలెబ్రెటీ హోదా భారీ పారితోషికాలు ఇప్పటివరకు ఎంజాయ్ చేసిన వారంతా ఈమాత్రం సహకరించి సినిమారంగాన్ని ఆదుకోలేరా అని ప్రశ్నిస్తున్నాడు. మణిరత్నం అభిప్రాయాలను సీరియస్ గా అనుసరిస్తే రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి మణిరత్నం సూచనలను రాజమౌళి అనుసరిస్తే బాగుంటుంది అన్నఅభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: