టాలీవుడ్ లో మహానటి సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగింది అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాల్లో కీర్తి నటన చూసి అసలు మహానటి ఆమెనే అని అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమా ఆ విధంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు ఎప్పుడు కూడా మర్చిపోయే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఆ విధంగా కీర్తి నటించింది. 

 

ఇక దర్శకుడు కూడా ప్రతీ సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా ఆయన తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి అప్పట్లో. ఆ సినిమాను వాస్తవంగా తీయలేదు అని సావిత్రి కి అనుకూలంగానే తీసుకొచ్చారు అని కొందరు అప్పట్లో వ్యాఖ్యలు ఎక్కువగా చేసారు. కీర్తి సురేష్ ని కూడా చాలా మంది తిట్టారు కూడా. దర్శకుడు ఒక కోణం మాత్రమే విని కథను తీసుకొచ్చారు అని జెమిని గణేషన్ కుమార్తె విమర్శలు చేసారు. 

 

ఆ తర్వాత ఏ విధంగా దీనికి ముగింపు పలకాలి అని చూసిన వివాదా౦ మాత్రం ఆగలేదు. కొన్ని కొన్ని సన్నివేశా లు సినిమాలో అసలు వద్దు అని జెమిని కుటుంబం డిమాండ్ కూడా చేసింది. అయినా సరే వాటిని అదే విధంగా ఉంచి సినిమాను ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమా వసూళ్లు కూడా ఒక రేంజ్ లో వచ్చాయి. ఈ సినిమాలో ఆమె నటన చూడటానికి సినిమా చూసిన వాళ్ళు ఒకటికి పది సార్లు చూసారు అనేది వాస్తవం. ఆ విధంగా సినిమా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: