ఎప్పుడు షూటింగ్స్ తో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ అంతా లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా రాకపోవడంతో ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు రకరకాల ప్రయోగాలు కూడా చేసి అలరించారు. ఎప్పుడు కిచెన్ వైపుకి వేళ్ళని భామలు కూడా తమ టాలెంట్ చూపించేస్తున్నారు. వారిలో సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ కూడా ఒకరు. లాక్ డౌన్ టైం లో ఆమె చేసిన సమోసా ఇంకా చాలా వెరైటీ డిష్ లను తన సోషల్ బ్లాగ్ లో పెట్టుకుంది కాజల్. 


ఇదిలాఉంటే లాక్ డౌన్ లో కొత్తగా చెస్ నేర్చుకున్నా అంటుంది అమ్మడు. అంతకుముందు చెస్ నేర్చుకోవాలని ఉన్నా కుదరలేదు.. ఎలా ఆడాలో తెలుసు కానీ ఆడింది లేదు. కానీ లాక్ డౌన్ వల్ల ఆన్ లైన్ లో చెస్ ఆడటం నేర్చుకున్నా అంటుంది కాజల్. అంతేకాదు ఎత్తుకి పై ఎత్తు ఎలా వేయాలో కూడా ఆమె నేర్చుకుందట. చెస్ వల్ల మైండ్ చురుగ్గా పనిచేస్తుందని.. ఉత్తేజభరితంగా ఉంటుందని అంటుంది కాజల్. అందుకే ఈ లాక్ డౌన్ టైం లో పూర్తిగా చెస్ మీద దృష్టి పెట్టామని అంటుంది కాజల్. 


ఇదేకాకుండా ఆధ్యాత్మిక విషయాల గురించి కూడా తెలుసుకున్నానని.. దూరదర్శన్ లో వచ్చిన రామాయణ్. మహాభారత సినిమాలు చూస్తున్నా అంటుంది కాజల్. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ ప్రస్తుతం తమిళంలో భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్, మురుగదాస్ కాంబోలో వస్తున్న తుపాకీ 2 సినిమాలో కూడా ఆమె నటిస్తుందని తెలుస్తుంది. తెలుగులో రెండు మూడు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. అవి ఏంటన్నది ఇంకా తెలియలేదు.         

మరింత సమాచారం తెలుసుకోండి: