తెలుగులో సంచలనం సృష్టించిన సినిమాల్లో కచ్చితంగా చేప్పుకునే  సినిమా వంగవీటి... విజయవాడ రౌడీ యుజం అంటూ ఈ సినిమాను తీసుకొచ్చారు. రాదా రంగా హత్యలను ఈ సినిమాలో చూపించారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కొందరిని హీరోలుగా కూడా చూపించారు వర్మ. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాల చుట్టూ వివాదాలు ఎక్కువగా తిరుగుతూ వచ్చాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో వివాదాల గురించి వర్మ ఎన్ని విధాలుగా వివరణ ఇచ్చిన అసారే ఆ వివాదాలు మాత్రం అలాగే కొనసాగాయి. 

 

మమ్మల్ని తక్కువ చేసి చూపించారు అని వంగవీటి రంగ కుటుంబం అలాగే వంగవీటి రంగా అభిమానులు చాలా మంది రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన అవ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. రంగా కుమారురుడు రాధ అయితే రోడ్ల మీదకు వచ్చి పూర్తి స్థాయిలో నిరసన కూడా చేసి వర్మకు వార్నింగ్ కూడా ఇచ్చారు అప్పట్లో. అయినా సరే వర్మ మాత్రం వెనక్కు తగ్గే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఈ సినిమా విడుదల అయి కొందరికి మాత్రమే నచ్చింది. ఆ కొందరు సినిమాను సోషల్ మీడియాలో కీర్తించడం కూడా అప్పుడు చాలా మందికి నచ్చలేదు. 

 

ఒక వ్యక్తి ఎక్కువగా హీరో అవుతున్నాడు అని అది కరెక్ట్ కాదు అని చాలా మంది అప్పట్లో కామెంట్స్ చేసారు. ఈ సినిమాను గనుక ఆపెయకపోతే తాము ఊరుకునేది లేదు అని చాలా మంది అన్నారు కూడా. ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు అత్యంత వివాదాస్పదంగా ఉన్నాయి అని అప్పట్లో కొందరు రంగా అభిమానులు వర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా సరే వర్మ ఎక్కడా కూడా వెనక్కు మాత్రం తగ్గలేదు అనే చెప్పవచ్చు. సినిమా కు మంచి వసూళ్లు కూడా వచ్చాయి అప్పట్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: