పవన్ కళ్యాణ్ కెరీర్ లో ది బెస్ట్ సినిమాల్లో కచ్చితంగా చెప్పుకునే సినిమా గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన అలాగే సినిమా కథ అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు అయితే సినిమా రేంజ్ ని ఒక రేంజ్ లో పెంచాయి అని చాలా మంది వ్యాఖ్యలు కూడా చేసారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి హిట్ కొట్టడానికి చాలా రోజులు పట్టింది. ఇక వసూళ్లు కూడా వంద కోట్లు దాటడం తో అప్పుడు పవన్ కళ్యాణ్ ని కమర్షియల్ హీరో అని అన్నారు. 

 

సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ కూడా ఒక రేంజ్ లో పెరిగింది అనే మాట అక్షరాలా నిజం. ఇక ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలను చూసి ఈ సినిమా మాతృక దబంగ్ కూడా షాక్ అయింది అనే మాట అక్షరాలా నిజం. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని వివాదాలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్ర చుట్టూనే వివాదాలు ఎక్కువగా నడిచాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో పోలీసులు మరీ సిల్లీ గా ఉన్నారు అని పోలీసు వృత్తి తో పాటుగా ప్రతీ సన్నివేశం తమని అవమానించే విధంగా ఉందని చాలా మంది పోలీసులు అన్నారు అప్పట్లో. దీనిపై ఆ విధంగా వివాదం నడిచింది. 

 

ఆ తర్వాత దీనికి సంబంధించి దర్శకుడు వివరణ కూడా ఇచ్చి మీ స్థాయి ని పెంచాను గాని ఎక్కడా తగ్గించిన సందర్భం లేదని ఏదైనా అలాంటి సన్నివేశం ఉంటే సినిమా నుంచి తొలగిస్తా అని కూడా చెప్పారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: