గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో  బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. నిజ జీవిత చరిత్రలని వెండితెర మీదకి తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడారంగాల్లో పేరు గాంచిన వారి జీవితాల్లోని ఆసక్తికర సంఘటనలని తీసుకుని సినిమాలని తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా క్రీడారంగానికి చెందిన ప్రముఖుల జీవిత గాథలని తెరకెక్కించాలని చూస్తున్నారు.

 

 

ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఎమ్ ఎస్ ధోనీ జీవిత కథతో వచ్చిన సినిమాకి కాసుల వసూళ్ళు కురిసాయి. ఇంకా 1983లో ఇండియాకి వరల్డ్ కప్ అందించిన క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం 83 పేరుతో రానుంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, దీపికా పదుకునే కపిల్ దేవ్ భార్య పాత్రలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరీ క్రేజీ బయోపిక్ ప్రకటన వచ్చింది.

 

 

 
ఒలింపిక్స్ లో భారతదేశం తరపున మొట్టమొదటి బంగారు పతకం సాధించిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్న వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితం వెండితెర మీదకి రాబోతుంది. శ్రీకాకుళంలో పుట్టిన కరణం మల్లీశ్వరి జీవితంలోని ఆసక్తికర సంఘటనల్ని, ఒలింపిక్స్ వరకూ ఆమె జీవిత ప్రయాణాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. కోన ఫిలిమ్ కార్పోరేషన్ బ్యానర్ లో కోనవెంకట్, ఎమ్వీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

అయితే ఈ సినిమాలో కరణం మల్లీశ్వరి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే విషయం ప్రకటించలేదు. ముందుగా ఈ పాత్రలో నిత్యా మీనన్ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ నిత్యా ఒప్పుకోలేదని సమాచారం. రకుల్ ప్రీత్, తాప్సీలని అడుగుతున్నారట. వెయిట్ లిఫ్టింగ్ లో భారతదేశానికి స్వర్ణపతకం అందించిన ఆ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. ఈ సినిమాకి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: