తెలుగు చిత్ర పరిశ్రమలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. యూత్ ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాడు విజయ్ దేవరకొండ. కేవలం తన సినిమాలతో నే కాకుండా తన ఆటిట్యూడ్తో కూడా యూత్ ని బాగా ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో  పెళ్లిచూపులు సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించిన విజయ్ దేవరకొండ.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి అర్జున్ రెడ్డి సినిమా తో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగారు. ఆ తర్వాత గీతా గోవింద సినిమా తో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా అంతకంతకూ పెరిగి పోయింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ చెప్పే మాటలు యూత్ ని  బాగా ఆకర్షిస్తుంటాయి. 

 


 అయితే విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు చేసిన సినిమాల పై వివాదాలు వచ్చాయి కానీ ఆ వివాదాల్లో  విజయ్ దేవరకొండ మాత్రం ఇన్వాల్వ్  కాలేదు. ఓ  సినిమా మాత్రం ఏకంగా విజయ్ దేవరకొండ పైనే వివాదాలు  వచ్చేలా చేసింది . అదే విజయ్ దేవరకొండ హీరో గా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా వరుస ఫ్లాప్లు చూస్తున్న విజయ్ దేవరకొండ కు ఈ సినిమా మంచి విజయం అందిస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతగా ప్రేక్షకాదరణ మాత్రం పొందలేకపోయింది. 

 

 ఇక విడుదల తర్వాత ఈ సినిమా విషయంలో ఎన్నో వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా కి మందు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కి విజయ్ దేవరకొండ సైన్ చేసాడని.. దీంతో ఒకప్పుడు తీసుకున్న పారితోషికమే  విజయ్ దేవరకొండ ఈ సినిమాకు తీసుకోవాల్సి వచ్చిందని...పారితోషకం  తగ్గడంతో ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ సరిగ్గా వర్క్ చేయలేదు అని దర్శకుడు ఆరోపణలు కూడా చేశారు. అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా విజయ్ దేవరకొండ పాల్గొన లేదని ఆరోపణలు చేశారు. అయితే ప్లాప్ అయ్యే  సినిమాకు ప్రమోషన్ ఎందుకు ఖర్చు దండగ అన్నట్లుగా విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించాడు అంటూ విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఇలా విజయ్ దేవరకొండ ఒక సినిమా విషయంలో వివాదాలను ఎదుర్కోవడం మొదటిసారి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: