అదేంటోగాని ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఎక్కువగా బూతు సినిమాలు వస్తున్నాయి. ఎలాగైనా ప్రేక్షకులను ఆకర్షించాలని ఉద్దేశంతో బూతు సినిమాల వైపు కొత్త దర్శకులు మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ సినిమాలో బూతు అనేది మామూలు గా ఉండడం లేదు. ఇక ఇలాంటి బూతు సినిమాలకు కూడా వివాదాలు భారీగానే చుట్టుముడుతున్నాయి. అయితే కొంతమంది హీరోల సినిమాలు ఘాటు రొమాన్స్ ఉంటుంది కానీ ఇలా చిన్న చిన్న సినిమాలుగా  వస్తున్న సినిమాల్లో మాత్రం ఘాటు రొమాన్స్ అనడం కంటే అంతకుమించి అనడమే బెటర్  అని చెప్పవచ్చు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో బూతు సినిమాగా వచ్చి ఎన్నో  వివాదాలను ఎదుర్కున్న  సినిమా డిగ్రీ కాలేజ్. 

 

 కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ప్రేమ చిగురించి... అది ఏకంగా శారీరకంగా కలిసేంతవరకు వెళ్లి... ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనే విషయాలను ఈ సినిమాలో చూపిస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలో ప్రేమలో మునిగి తేలుతున్న జంట చేసే రొమాన్స్ మాత్రం.. భూతో భూతస్య భూతోబ్యహ అనే రేంజ్లో ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి కనీసం ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని కూడా చూడలేని పరిస్థితి. దారుణంగా  ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా పై వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. 

 


 ఇలాంటి బూతు సినిమాలను తెరకెక్కించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అని ఎంతో మంది విమర్శలు కూడా చేశారు. ఇలాంటి బూతుసినిమాలు తెరకెక్కించడానికి కాస్తయినా తెలివి ఉండాలి అంటూ ఎంతో మంది విమర్శలు కూడా చేశారు. ఇలాంటి సినిమాల కారణంగానే యూత్ మరింతగా చెడిపోతున్నారు అంటూ మరికొంతమంది ఆరోపణలు చేశారు. సినిమా విడుదలను తప్పక అడ్డుకుంటామంటూ కొంతమంది వార్నింగ్ లు కూడా ఇచ్చారు. ఇలా ఈ సినిమా చుట్టూ మొదటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి. అయినప్పటికీ చిత్రబృందం మాత్రం ఈ సినిమా విడుదల చేయడానికి సిద్ధపడి విడుదల చేసింది. సినిమా విడుదలైన తర్వాత ఎక్కడ తెరమీద కనిపించకుండా మాయం అయిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: