సాధార‌ణంగా మన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో పాటు ఎన్నో కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేస్తుంటాయి. అవి ఒక్కోసారి పెద్ద పెద్ద వివాదాలుగా కూడా మారుతుంటాయి. అయితే  టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ఎలాంటి కాంట్రవర్సీ లు లేని ఇమేజ్ ఉన్న హీరోగా పేరు సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని ఇటీవ‌ల `నానీ గ్యాంగ్ లీడర్` సినిమా విష‌యంలో చాలా కాంట్ర‌వ‌ర్సీలు ఎదుర్కొన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని హీరోగా నటించగా.. మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన నటించారు.

 

ఈ సినిమాలో.. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ విష‌యంలో మెగా ఫ్యాన్స్ బాగా ఫైర్‌ అయ్యారు. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి మెగా బ్లాక్ బస్టర్ మూవీస్ లో గ్యాంగ్ లీడర్ కి ప్ర‌త్యేక‌ క్రేజ్ ఉంటుంది. ఆ టైటిల్ ని తిరిగి వాడుకుంటే కేవలం మెగా వారసుడు అయిన రామ్ చరణ్ మాత్రమె వాడుకోవాల‌ని... అలాంటిది ఆ టైటిల్ ని నువ్వు ఎలా వాడుకుంటావ్ అంటూ సోషల్ మీడియాలో నానిపై నెగటివ్ కామెంట్స్‌ చేశారు మెగా ఫ్యాన్స్. అయితే  స్టార్ గా ఎదిగిన నాని ఆ టైటిల్ ని వాడుకుంటే తప్పేంటి అంటూ మిగిలిన హీరోలు నానీకి స‌పోర్ట్ చేయ‌డంతో ఆ వివాదం స‌ద్దుమ‌నిగింది.

 

కానీ, ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది అనుకున్న టైమ్‌లో నానికి మ‌రో చిక్కు ఎదురైంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు.. ఓ యువ హీరో `గ్యాంగ్ లీడర్` టైటిల్ నాది అని మీడియా ముందుకొచ్చాడు. తాను ఎప్పుడో “గ్యాంగ్ లీడర్” అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించుకున్నానని, మైత్రీ మూవీ మేకర్స్ కనీసం తనను సంప్రదించకుండా నాని సినిమాకి ఫిక్స్ చేయడమే కాక ఎనౌన్స్ కూడా చేశారని ప్రెస్ మీట్ పెట్టి మరీ రచ్చ ర‌చ్చ‌ చేశాడు. దీంతో చివ‌ర‌కు చేసేదే‌మిలేక‌ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్యాంగ్ లీడ‌ర్‌ను  'నాని గ్యాంగ్ లీడర్' అంటూ టైటిల్ మార్చారు.

 
  
  

మరింత సమాచారం తెలుసుకోండి: