ఆరుగురు పతివ్రతలు... ఈ తరానికి పెద్దగా ఈ సినిమా పరిచయం లేదు గాని ఈ సినిమా మాత్రం టాలీవుడ్ ని ఒక రకంగా షేక్ చేసింది అని చెప్పవచ్చు. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నా సరే సినిమాను వివాదాలు మాత్రం ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలను అవమానించే విధంగా సినిమాను తీసుకొచ్చారు అని కొందరు కామెంట్ చేసారు అప్పట్లో. అదే విధంగా దర్శకుడు  ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాను తెరకెక్కించారు అని అన్నారు. 

 

ఇక దర్శకుడి మీద దాడి కూడా జరిగింది. వైవాహిక జీవితాన్ని అవమానించే విధంగా సినిమాను రూపొందించారు అని అప్పుడు కొంత మంది ఆందోళన కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రతీ సన్నివేశం కూడా అవమానించే విధంగా ఉన్నాయి అని మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసాయి అప్పట్లో. అయినా సరే దర్శకుడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మూడో పాత్ర విషయంలో మొదటి పాత్ర విషయంలో ఆ సినిమాలో వివాదం వచ్చింది. భర్తను అవమానించే విధంగా తీసారు ఆ సీన్ అని కొందరు ఆగ్రహం వ్యక్తం కూడా చేసారు. 

 

అయితే సినిమా మాత్రం చాలా మందికి నచ్చింది అని అన్నారు. కొన్ని కొన్ని సన్నివేశాలను జాగ్రత్తగా తీసి ఉంటే మంచి విజయం సాధించేది అని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేది అని కొందరు అన్నారు. ఇక ఈ సినిమా మంచి వసూళ్లను కూడా సాధించింది. ఆ తర్వాత ఆ దర్శకుడు ఏ సినిమా కూడా చేయలేదు అనే సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో ఆయన ఖమ్మం జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. దర్శకుడి మీద దాడి జరిగింది అనే విషయంలో అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. కొందరు అవును అన్నారు  మరి కొందరు కాదు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: