బాలీవుడ్ లో పద్మావత్ సినిమా ఏ విధంగా సంచలనం సృష్టించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉంది. ఇప్పటికి కూడా సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఒకటికి పది సార్లు చూసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాను వివాదాలు మాత్రం చాలా బాగా వెంటాడాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రాణీ పద్మావతి ని అవమానించే విధంగా సన్నివేశాలను షూట్ చేస్తున్నారు అని దర్శకుడి మీద రాజస్థాన్ లో సినిమా షూటింగ్ సమయంలో దాడి కూడా చేసారు. 

 

ఆ తర్వాత సినిమా సెట్స్ ని కూడా కాల్చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా మరిన్ని వివాదాలు కూడా సినిమాను వెంటాడాయి. అసలు పద్మావతి టైటిల్ ని ఉంచవద్దు అని మార్చాలి అని డిమాండ్ చేసారు. దీనితో టైటిల్ ని మార్చి పద్మావత్ అని పెట్టింది చిత్ర యూనిట్. ఆ తర్వాత కూడా సినిమాను వివాదాలు బాగానే వెంటాడాయి అని చెప్పవచ్చు. అయితే కొన్ని కొన్ని సన్నివేశాలను బలవంతంగా  తీసి వేయించారు. ఇక గుజరాత్ ఎన్నికల గురించి కూడా ఈ సినిమాను వాయిదా వేసారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రధానంగా రాజ్ పుత్ లను అవమానించే విధంగా సినిమాను చూపించారు అని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు తీసి వేయడం తో సినిమాలో అందమే పోయింది అని చాలా మంది అన్నారు. లేకపోతే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రపంచాన్ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి తీసుకొచ్చారు అని అన్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: