టాలీవుడ్ లో ద‌గ్గుపాటి వారి వంశాంకురం రానా పెళ్లి గురించి పెళ్లి కొడుకు పెళ్లి కూతురి కుటుంబ సభ్యుల కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలకు ఎక్కువగా ఆసక్తి ఉంది. అనవసర విషయాల గురించి ఎక్కువగా పట్టించుకునే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా ఇప్పుడు రానా పెళ్లి విషయంలో ఒక వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చారు. రానా మిహీక అంతకు ముందు నుంచే సహజీవనం చేస్తున్నారని, రానా ఆమె కోసం తరుచుగా జైపూర్ కూడా వెళ్లి వచ్చే వాడు అని పుకార్లు షికార్లు చేయిస్తున్నారు.

 

బాహుబలి సినిమా షూటింగ్ టైం లో రహాస్యంగా పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరూ భావించినా సరే... అప్పుడు రానా బిజీగా ఉండటం తో సాధ్యం కాలేదు అని అంటున్నారు. రానా అప్పుడు వివాహం చేసుకోవడానికి పెద్దలను ఒప్పించినా సరే వద్దు అన్నారని టాక్. దీనితో ఇద్దరూ కూడా సహజీవనం చేసారని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కొంద‌రు గుస‌గుస‌లాడు కుంటున్నారు. ఇక రానా - మిహీకా పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అవ్వ‌డంతో చేసేది ఏమీ లేక పెద్దలు పెళ్ళికి అంగీకరించారు అని తెలుస్తుంది. 

 

ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ లో ఉండే వారు అని టాక్. చివరికి పెద్ద‌ను ఒప్పించి ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. కాగా వీరి వివాహం ఆగస్ట్ 8 న జరిగే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆరో తేదీ నుంచి కూడా వేడుకలు మొదలయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు. మరి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది చూడాలి. డిసెంబర్ లో వీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: