పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది మీరాచోప్రా. 2006వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మీరా చోప్రా తరువాత వాన సినిమాతో ఆకట్టుకొని గ్రీకు వీరుడు లాంటి చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. కానీ ఈమె నటించిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో కూడా ఎవరికీ తెలీదు. దీంతో తెలుగు సినిమా రంగంలో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు కోసం మీరా చోప్రా వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం 'మొగలిపువ్వు' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MEERA' target='_blank' title='meera-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>meera</a> Chopra Receives Rape & Death Threats...

ఇదిలా ఉంటే తనని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధిస్తున్నారని సోషల్ మీడియాలో సంచలన కామెంట్ చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో లైవ్ లో మీరా చోప్రా రావటంతో చాలామంది ఆమెను ప్రశ్నలు వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని తెలపగా మంచి వ్యక్తిత్వం మనసున్న మనిషి అని మీరా చోప్రా అంది. మరొకరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పుకొచ్చింది.

IHG

ఇదే సమయంలో వేరొకరు జూనియర్ ఎన్టీఆర్ పై మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా... జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదని మీరా చోప్రా షాక్ ఇచ్చే ఆన్సర్ ఇచ్చింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రా ని సోషల్ మీడియాలో బండబూతులు తిడుతున్నారు. గ్యాంగ్ రేప్ చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. ఇంకా అసభ్యకరమైన భాషతో బూతు కామెంట్ లు ఎక్కువ పెట్టడంతో మీరాచోప్రా తనపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: