బుల్లితెర యాంకర్ గా అలరిస్తున్న ప్రదీప్ హీరోగా చేస్తున్న మొదటి ప్రయత్నం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? మున్నా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన నీలి నీలి ఆకాశం సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే పాపులర్ అయిన ఈ సాంగ్ 1 మిలియన్ నుండి 150 మిలియన్ వ్యూస్ సాధించింది. మ్యూజిక్ లవర్స్ ను ఈ సాంగ్ బాగా అలరించిందని చెప్పొచ్చు. 

 

మాములుగా స్టార్ హీరోల సినిమాల్లోని పాటలకే అది కూడా సూపర్ హిట్ అయిన ఒకటి రెండు పాటలకే 100 మిలియన్, 150 మిలియన్ వ్యూస్ వస్తాయి. ప్రదీప్ హీరోగా చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం దానిలో సాంగ్ సూపర్ హిట్ అవడం గొప్ప విషయం. ప్రదీప్ సరసన అమృత అయ్యర్ నటిస్తున్న ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ ను చంద్రబోస్ రాశారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సిద్ శ్రీరామ్ ఈ సాంగ్ పాడగా సునీత కూడా సాంగ్ లో భాగమయ్యారు. 

 

మొదటి సినిమాలోని మొదటి సాంగ్. ఇలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నా ప్రదీప్ మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సాంగ్స్ తో సినిమాపై అంచనాలు ఏర్పడగా దానికి తగినట్టుగా కథ ఉంటే ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. అయితే పాటల్లో కాదు అసలు మ్యాటర్ అంతా సినిమాలోనే ఉందని అంటున్నారు చిత్రయూనిట్. మొత్తానికి ప్రదీప్ మొదటి సినిమా సాంగ్స్ నుండే స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. మరి సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందో లేదో చూడాలి.                                 

 

మరింత సమాచారం తెలుసుకోండి: