లాక్ డౌన్ కరోనా వైరస్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీ చాలా నష్టాలు ఎదుర్కొంటుంది. ఒకపక్క సినిమా షూటింగులు ఆగిపోవటం మరోపక్క సినిమా థియేటర్లు భవిష్యత్తులో ఎలా పని చేయించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి షూటింగులకు అనుమతులు తీసుకోవడం జరిగింది. ఇటువంటి సమయంలో థియేటర్లలో భవిష్యత్తులో ఏ విధంగా సినిమాలు ప్రదర్శించాలి అన్న దాని విషయంలో ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నా ఎవరికీ సరైన ఐడియా రావడం లేదు.

IHG

సినిమా థియేటర్ల యాజమాన్యాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల హైదరాబాద్ నగరంలో సుదర్శన్ థియేటర్ లో సినిమా హాల్లో సీటు కు సీటుకు మధ్య ఓ సీటు గ్యాప్ వుండేలా మార్పులు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. దీంతో ఈ ఫోటోలు చూసి చాలా మంది సినిమా ధియేటర్ లలో సీట్లు తగ్గించే చేస్తే సినిమా వ్యాపారం ఉండదు అదేవిధంగా టికెట్ డబల్ రేట్ చేసిన ప్రేక్షకుడు సినిమా హాల్ కి వచ్చే చాన్స్ ఉండదు అనే కామెంట్లు వస్తున్నాయి.

IHG

ఇలాంటి సీట్లు తగ్గించే నిర్ణయం వల్ల మనకే భారీ లాస్ సినిమా మరోపక్క థియేటర్స్ ఓనర్స్ అంటున్నారు. కావాలంటే థెర్మల్ టెంపరేచర్ చెకింగ్, క్యూ లైన్లు, ఎంట్రీ లైన్ల దగ్గర సోషల్ డిస్టాన్స్ వంటివి జాగ్రత్తగా పాటిస్తామని, అలాగే షో కి షో కి మధ్య థియేటర్ సీట్లు శానిటేషన్ వంటివి చూస్తామని, అంతే తప్ప, సీట్లు కుదింపు అంటే కుదరని పని అని థియేటర్ యాజమాన్య సంఘాలు అంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: