టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టైంలో అన్న ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉండేది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఈ లెజెండరీ యాక్టర్స్ అందించిన సేవలు ఎవరు మర్చిపోలేనివి. ఇద్దరూ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడి మరీ సినిమాలు చేసేవారు. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య కూడా పోటీ వాతావరణం అలాగే ఉండేది. వాస్తవానికి వస్తే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి గౌరవం మరియు అభిమానం. సినిమా ఇండస్ట్రీలోకి కృష్ణ గారి కంటే ముందే రామారావు రావటం జరిగింది. కృష్ణ గారు కాలేజీ చదువుతున్న టైములో రామారావు గారి సినిమాలను చూస్తూ ఆయన ని బాగా అభిమానించే వాడు. ఆ తర్వాత కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీ లోకి రావడంతో పాటు అనేక ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి కొత్త టెక్నాలజీ తీసుకువస్తూ చాలా మందిని తన వైపుకి ఆకర్షించడం జరిగింది.

IHG

ఆ విధంగా కృష్ణ గారు నటించిన కౌబాయ్ సినిమా అయినా మోసగాళ్లకు మోసగాడు సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. అయితే ఆ సినిమా చూసిన ఎన్టీఆర్ ఓ స్టార్ హీరో పొజిషన్ లో ఉన్న గాని… ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చి సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ సినిమాలు చేస్తున్న కృష్ణ గారిని అభినందిస్తూ లేఖలో ఇలా పేర్కొన్నారు. "సోదరుడు శ్రీకృష్ణ తీసిన మోసగాళ్లకు మోసగాడు సినిమా చూసాను. ఎంతో ప్రయాసలకు లోనై ఒక విశిష్టమైన సాంకేతిక విలువలతో ఈ చిత్ర నిర్మాణం జరగాలన్న ధ్యేయం.. పట్టుదల ప్రతి షాటులోను ప్రతి ఫ్రేములోను కన్పించింది. తెలుగు భాషలో చూస్తున్న ఇంగ్లీష్ చిత్రమా అనిపించింది. ముఖ్యంగా ప్రశంసించదగినది ఛాయాగ్రహణం.. ఇంత మనోజ్ఞంగా ఉన్నత ప్రయాణంలో కెమెరాను ఉపయోగించిన శ్రీ స్వామి అభినందనీయుడు.

IHG' - The Statesman

కథకు అనుగుణమైన వేగంతో దర్శకత్వం వహించిన శ్రీ వాసు ప్రశంసాపాత్రుడు. అన్నారు. అంతేగాక ఇంత సాంకేతిక విలువలతో జాతీయత మన సంస్కృతి మన సాంఘిక వాతావరణం ప్రతిబింబించే అభ్యుదయ భావ పూరితములైన మహత్తర కళాఖండాలను అభిమానులకు శ్రీ కృష్ణ అందించగలరని ఆశిస్తూ.. సాహసోపేతమైన ఈ చిత్ర నిర్మాణ కృషికి కృష్ణను అభినందిస్తున్నాను.." అంటూ అన్నగారు పొగడటం జరిగింది. ఎన్టీఆర్ రాసిన ఆ లెటర్ ఇటీవల సోషల్ మీడియాలో బయటపడటంతో  వైరల్ అవుతోంది. దాన్ని చదివిన నెటిజన్లు చాలామంది అప్పట్లో రామారావు- కృష్ణ గారి ల మధ్య అనుబంధం అలా ఉండేది అంటూ కామెంట్ పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: