నయనతార నయాగరా జలపాతం లాంటి దూకుడు ఉన్న సోయగాల చిన్నది. అభినయం కూడా జత చేసి కళ్ళు రెండూ తనవైపూ తిప్పుకునేలా చేసే మ్యాజిక్ ఆమె సొంతం. నయన్ సౌంతిండియా సూపర్ స్టార్. ఆమె కాల్షీట్ల కోసం సీనియర్లు సైతం క్యూ కడతారు. ఆమె సినిమాలో ఉంటే చాలు సై అంటారు.

 

ఇక ఆమె పెట్టే అన్ని కండిషన్లు కూడా ఒప్పుకుని మరీ మూవీ చేస్తారు. నిజానికి నయనతార హీరో ఇమేజినే ఎంజాయి చేస్తున్నారు. అటువంటి నయనతార గురించిన ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటి అంటే ఆమె తన మాజీ ప్రియుడు ప్రభుదేవా డైరెక్షన్లో నటిస్తోందని. నిజంగా వినడానికే షాక్ ఈ న్యూస్.

 

ప్రభుదేవాతో నయన్ లవ్ ఓ రేంజిలో సాగిందని అప్పట్లో అంతా ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్యన ఎంత ఘాటు ప్రేమ అన్నట్లుగా నడించింది. ఇద్దరూ ఏ ఫంక్షన్ చూసినా కనిపించేవారు. ఇద్దరి జంటా కన్నుల పంటే అయింది. ఇక పెళ్ళి పీటలు ఎక్కడమే తరువాయి అనిపించేలా ఈ జంట ముచ్చట్లు పెట్టారు.

 

అయితే అనుకోకుండా ఈ ఇద్దరూ విడిపోయారు. తన హార్ట్ బ్రేక్ అయిందని కూడా నయన్ బాధపడింది. ఇక లవ్ తన లైఫ్ లో లేదు అని కూడా అంది. అదే సమయంలో ఆమె కొంత మూడీగా కూడా ఉంది. ఆ తరువాత మనసు మార్చుకుని సినిమాలు చేస్తూ వచ్చింది. 

 

ఇంతలో ఆమె ప్రేమ మళ్ళీ మొలకెత్తింది. అది దర్శకుడు విఘ్నేష్ తో. ఈ ఇద్దరు కూడా పెళ్ళి చేసుకుంటారని ఓ వైపు టాక్ నడుస్తోంది. హిందూ, క్రిస్టియన్ ట్రెడిషన్లో పెళ్ళి తొందరలోనే జరుగుతుందని కూడా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

 

ఇంతలో ఉన్నట్లుండి నయన్ ప్రభుదేవా డైరెక్షన్లో నటించడం అంటే నిజంగా అది ఊహకు అందని వార్తే. దీన్ని ఎవరూ అంత తేలికగా  డైజెస్ట్ చేసుకోలేరు కానీ ఇది నిజం అవబోతోందిట. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ ఇద్దరు కలసి చేసే సినిమా షూటింగు మొదలుపెడతారు అంటున్నారు.

 

ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ ఉంటుందని, ఇలంటి మూవీ ప్రభుదేవా మాత్రమే డైరెక్ట్ చేయగలరని నయన్ ఆయన డైరెక్షన్ కి ఒకే అందిట. మరి ప్రభుదేవా నయన్ రిలేషన్ షిప్ కేవలం హీరోయిన్ డైరెక్టర్ వరకూ ఉంటుందా. అంతకు ముంచి సాగుతుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా నయన్ షాకింగ్ ఇపుడు  ఓ రేంజిలో న్యూస్ వైరల్ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: