ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలితో నేషనల్ వైడ్ అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకున్న రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాను తెరకెక్కించే విధానంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నాడు జక్కన్న. రాజమౌళితో రెగ్యురల్ గా ట్రావెల్ చేస్తున్న కెకె సెంధిల్ కుమార్ ఈ సినిమాకు కూడా కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ సినిమా గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. సినిమాపై ఉన్న అంచనాలు అందుకునేందుకు తామెంత కష్టపడుతున్నామో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

IHG

 

‘రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ఈ సినిమాను కొన్ని దశాబ్దాలు వెనక్కు వెళ్లి తీయాలి. అప్పటి కాలమాన పరిస్థితులు గురించి ఎవరికీ ఐడియా లేదు. కథ ప్రకారం ముందుకెళ్తున్నాం. ఈ సమయంలో ఆనాటి పరిస్థితులు కనిపించేలా తెరకెక్కించడం చాలా కష్టం. ఇటువంటి ఛాలెంజింగ్స్ తో ఈ సినిమాకు పని చేయడం ఓ సవాల్ లా మారింది. ఫ్యాన్స్ అంచనాలు అందుకునే విధంగా వీరిద్దిరినీ చూపించాల్సి ఉంది..’ అంటూ తాము పని చేస్తున్న పరిస్థితులను చెప్పుకొచ్చాడు సెంథిల్ కుమార్. దశాబ్దాల వెనక్కు వెళ్లడం అంటే ఎవరికైనా సవాలే. చాలా జాగ్రత్తగా పరిస్థితులను ఊహించి తెరకెక్కించడం తప్పనిసరి.

IHG 

 

సెంథిల్ మాటలతో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్, రామ్ చరణ్ ప్రోమో వీడియోతో సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్లాయి. పరిస్థితులు అనుకూలించక ఎన్టీఆర్ ప్రోమో విడుదల కాలేదు. ఎన్టీఆర్ లుక్ కోసం కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికి 60 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. వచ్చే ఏడాది ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: