బాలీవుడ్ ముద్దుగుమ్మ వాణి కపూర్ ట్రోలింగ్ కి గురి కావడం కొత్త విషయమేమీ కాదు. సోమవారం సాయంత్రం ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అనే సెషన్ నిర్వహించగా... అనేకమంది నెటిజనులు ఆమె తదుపరి సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి, ఇంకా ఎన్నో అంశాల గురించి అడిగారు. అయితే ఈ క్రమంలోనే ఒక నెటిజెన్ ఆమెపై... 'you ugly b**(ల**) అని కామెంట్ చేశాడు. ఈ కామెంటు ఆమెకు తారసపడగా... దాన్ని స్క్రీన్ షాట్ తీసి తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసి... నువ్వు చాలా మంచి వాడివి. ఎవరిని ద్వేషించకు', అని ఒక హార్ట్ ఎమోజి తో అతడి కామెంట్ కి రిప్లై ఇచ్చింది. ఈ కామెంట్ చేసిన వ్యక్తికి ఈమెకు ఎటువంటి పగలు ప్రతీకారాలు లేవు. కానీ అతడు మాత్రం ఆమెని అనకూడని పదజాలముతో కించపరిచాడు. ఇటువంటి చెడ్డ మాటలను సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు. ఈ కామెంట్ లో మాటలను బట్టి అతడి మనస్తత్వాన్ని అంచనా వేసి... నిన్ను నువ్వు పరిశీలించుకో. ఏదో ఒక మూలన మంచితనం ఉండే ఉంటుంది. ఆ మంచితనానికి మంచి ప్రాధాన్యత ఇచ్చి ఇతరులపై ద్వేషాన్ని చూపించే ప్రవర్తనకు దూరంగా ఉండు అంటూ ఆమె కేవలం ఒకే ఒక వాక్యం ద్వారా కామెంట్ చేసిన వ్యక్తి జ్ఞాన బోధ చేసింది. 


అత్యంత అభ్యంతరకరమైన కామెంట్ కి కూడా చాలా హుందాగా రిప్లై ఇచ్చిన వాణీకపూర్ ప్రస్తుతం అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఎంతటి చెడ్డవారిని అయినా మంచి మాటలతో, ప్రేమతో మార్చవచ్చు అనే సిద్ధాంతాన్ని వాణికపూర్ బాగా పాటిస్తుందని అనేక సందర్భాల్లో నిరూపితమయింది. గతంలో ఒక నెటిజెన్ ఆమె శరీరం గురించి తప్పుడుగా కామెంట్ చేసినప్పుడు ఆమె స్పందిస్తూ... నువ్వు పనికొచ్చే పనులు ఎందుకు చేయవో నాకు అర్థం కావడం లేదు. ఇతరులను నిందించడం వలన నీపై నీలో ఎంత ద్వేషం ఉందో స్పష్టమవుతుంది. జీవితం చాలా విలువైనది. ఇప్పటికైనా ఇతరులను ద్వేషించడం మానుకో', అని ఆమె అతడికి బుద్ధి చెప్పింది. 


ఇకపోతే ఈ 31 ఏళ్ళ ముద్దుగుమ్మ శుద్ దేశి రొమాన్స్, బేఫికర్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరినీ బాగా అలరించింది. తెలుగులో హీరో నాని సరసన ఆహా కల్యాణంలో హీరోయిన్ గా నటించింది కానీ ఈమెకు అంతగా ప్రేక్షకాదరణ దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: