సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురం అని ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు కవలలుగా మహేష్ యాక్ట్ చేశాడు. ఆ మూవీ బంపర్ హిట్ కూడా కొట్టింది. ఆ తరువాత సోలోగా హీరో అయ్యాక మహేష్ ఇప్పటికి పాతిక పైగా సినిమాలు చేశాడు కానీ అన్నీ కూడా  సింగిల్ రోలే చేస్తూ వచ్చాడు. అయితే మహేష్ బాబుని రెండు పాత్రల్లో చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కలలు కంటున్నారు.

 

మరి మహేష్ రెండు కాదు మూడు పాత్రల్లో కనిపిస్తే ఎలా ఉంటుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కిందా మీద పడిపోరా. ఇపుడు అదే జరుగుతుందా అంటే గాసిప్స్ మాత్రం అలాగే వస్తున్నాయి. మహేష్ బాబు కొత్త సినిమా సర్కార్ వారి పాట సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తారని అంటున్నారు. ఈ మూవీలో మహేష్ క్యారక్టర్ని అలాగే డిజైన్ చేశారని ప్రచారం అయితే సాగుతోంది.

 

క్లాస్ మాస్ గా మహేష్ భిన్నమైన రూపాల్లో కనిపించి ఫ్యాన్స్ ని కేక పెట్టిస్తాడు అంటున్నారు. తెలుగు తెర మీద ఎన్టీయార్, క్రిష్ణ చిరంజీవి, బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీయార్ త్రిపాత్రాభినయం చేశారు. మిగిలిన హీరోలకు ఆ చాన్స్ రాలేదు. ఇక టాలీవుడ్లో బాలక్రిష్ణ ద్విపాత్రాభియనం ఎక్కువ సినిమాల్లో చేశాడు, ఆ తరువాత క్రిష్ణ కూడా ఎక్కువ నటించారు.

 

ఇప్పటితరం హీరోలు మాత్రం డ్యూయల్ రోల్ వేయడానికి ఆలోచిస్తున్నారు. అలాంటిది మూడు పాత్రలు అంటే నిజంగా గ్రేటే అనాలి. మరి మహేష్, పరశురాం కాంబో మీద వస్తున్న గాసిప్పులు నిజం కావాలని అభిమానులు మనసారా కోరుకుంటున్నారు.

 

మరో వైపు టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు ఒక పాత్రతో వెండితెర మీద కనిపిస్తేనే లేడీ ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటిది మూడు రోల్స్ తో సినిమా తెర నిండా మహేష్ కనిపిస్తే పిచ్చెక్కిపోరా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. అదే జరిగితే మహేష్ రికార్డ్ బ్రేక్ చేసినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: