రాజకీయాలు అయినా మరొకటి అయినా ఇంకొకటి అయినా సరే సోషల్ మీడియా మాత్రం ఒక రేంజ్ లో ఇప్పుడు జనాలకు ఉపయోగపడుతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రచారం చేసుకోవడానికి గానూ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు జనాలు. ఇప్పుడు రాజకీయాలతో పాటుగా సినిమాలను ప్రచారం చేసుకోవడానికి గానూ సోషల్ మీడియాలో ఎక్కువగా ఖర్చు చేసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాను తెలుగు సినిమా బాగా వాడుకునే ఆలోచనలో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. 

 

ఇప్పుడు ప్రచారం కోసం మీడియా సంస్థలను వదిలి పెట్టాలి అని నష్టాల నుంచి బయటకు రావాలి అంటే కచ్చితంగా సోషల్ మీడియా ఉపయోగపడే అవకాశం ఉంది అని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రచారానికి అగ్ర హీరోల సినిమాలకు భారీగా ఖర్చు అవుతుంది అని సోషల్ మీడియా ద్వారా దాన్ని ఎదుర్కోవాలి అని భావిస్తున్నారు. చిన్న చిన్న హీరోల సినిమాలకు కూడా సోషల్ మీడియా బాగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అనే విషయం ప్రత్యేకంగా చేఒపాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా మీద హీరోలు కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు అని సమాచారం. 

 

మహేష్ బాబు ఇప్పుడు తన సినిమాలను సోషల్ మీడియాలోనే ఎక్కువగా ప్రచారం చేసుకోవాలి అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజం ఎంత అనేది పక్కన పెడితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది. చిరంజీవి కూడా ఆచార్య సినిమా విషయంలో అదే విధంగా ముందుకు వెళ్తున్నారు అని సమాచారం. మరి ఇది ఎంత వరకు హీరోలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి. రామ్ చరణ్ ఇప్పటికే ఆచార్య విషయంలో ప్రచారం మొదలుపెట్టడానికి సిద్దంగా ఉన్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: