సౌత్ తో పాటు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని ఇంకో భాషలోకి రీమేక్ చేసి హిట్స్ అందుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్నదేమీ కాదు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ కాలం నుండి వస్తున్నదే. అయితే రచయిల కొరత వల్ల ఇలా రీమేక్ చేయాల్సి వస్తుందన్న మాట ప్రథమంగా వినిపిస్తున్నప్పటికి దీన్ని ఏకీభవించేవాళ్ళు మాత్రం తక్కువే. అయితే ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో తీయాలన్నా కూడా పెద్ద రిస్కే. అలా చేయాలన్నా రచయిత ఉండాల్సిందే. పైగా రెండు భాషల మీద పట్టు ఉండాలి. అయినా రిస్క్ ఉంది... అదే నెట్ ఫ్లిక్స్, అమోజాన్. సినిమా రిలీజై నెల తిరగకుండానే ఆ సినిమా వచ్చేస్తుంది. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=LUCIFER' target='_blank' title='lucifer-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>lucifer</a> ...

 

అయినా మేకర్స్ ఏ ధైర్యం తో సినిమాని రీమేక్ చేస్తున్నారో అర్థం కావండ లేదు. ఇక మన టాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని సినిమాలు తమిళం, హిందీ, మళయాళం మాత్రమే కాదు కొరియన్ లాంగ్వేజ్ నుండి రీమేక్ చేస్తున్నారు. అలా 2020 లో కొన్ని చిత్రాలు రీమేక్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించారు. అంతేకాదు ఇదే సినిమాని కోలీవుడ్ లో అజిత్ తో రీమేక్ చేశారు. అక్కడా విజయం సాధించింది. దాంతో పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు. హిందీ తమిళంలో 100 కోట్ల వసూళ్ళు సాధించిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి సక్సస్ ని అందుకుంటుందో చూడాలి. 

 

IHG's Vakeel Saab: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HINDI' target='_blank' title='hindi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hindi</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PINK' target='_blank' title='pink-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pink</a> Or <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> Pink? | Gulte - Latest ...

 

ఇక అలాగే మరో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ లో ధనుష్ నటించిన ఈ కల్ట్ మూవీ 100 కోట్ల వసూళ్ళని సాధించింది. 2019 లో భారీ హిట్ గాను నిలిచింది. దాంతో ఈ సినిమాని నిర్మాత సురేష్ బాబు రైట్స్ కొన్నారు. కొన్నప్పుడు అందరు కాస్త అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఎలా వర్కూట్ అవుతుంది అని. కాని ఎప్పుడైతే నారప్ప అంటూ వెంకటేష్ ని టైటిల్ లుక్ లో రివీల్ చేశారో అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. వెంకీ మేకోవర్ తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. 

 

IHG

 

ఇలానే మరికొన్ని సినిమాలు ఈ సంవత్సరం టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ అందుకున్న రాం పోతినేని తో కిషోర్ తిరుమల రెడ్ సినిమాని తెరకెక్కితెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాకి మూలం తమిళ హిట్ సినిమా తడం. అలాగే సుమంత్ హీరోగా ఒక సినిమాని రీమేక్ చేస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తున్న కపటదారి సినిమాకి కన్నడ సినిమా కవలుదారి ఆధారం.

 

IHG

 

ఇక యంగ్ హీరో నితిన్ కూడా బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ ని తెలుగులో సొంత బ్యానర్ లో రీమేక్ చేస్తున్నాడు. వీటితో పాటు సుజీత్ చిరంజీవి కాంబినేషన్ లో లూసిఫర్, అయ్యప్పనుం కోషియుం సినిమాలు తెలుగులో రీమేక్ కానున్నాయి. మరి ప్రస్తుతం కరోనా తో నెలకొన్న పరిస్థితుల్లో ఈ రీమేక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: