ఘంటసాల ప్రతీ ఇంటా కంచుగంటలా  మోగే గాన గంధర్వుడు. ఆయన మూడు దశాబ్దాల‌ పాటు తెలుగు చిత్ర సీమలో ఎన్నో అపూర్వమైన గీతాలను ఆలపించి శ్రోతలను ఉర్రూతలూగించారు. ఇక ఘంటశాల మంచి పీక్ పీరియడ్లో ఉండగానే బాలు తెలుగు  సినిమాల్లోకి వచ్చారు.

 

బాలు తొలి దశలోనే మంచి అవకాశాలు సంపాదించుకుని ఘంటశాల ద్రుష్టిలో పడ్డారు. బాగా పైకి వచ్చే మంచి గాయకుడు బాలు అవుతాడని ఆనాడే ఘంటశాల ఒక అంచనాకు వచ్చారు. బాలు ఇండస్ట్రీకి వచ్చిన మూడేళ్ళకే ఘంటశాలతో కలసి ప్రతీ రాత్రీ వసంత రాత్రి అంటూ ఎన్టీయార్  ఏకవీర సినిమాలో  యుగళగీతాన్ని ఆలపించి ఆయన మెప్పు పొందారు.

 

ఇక బాలును ఘంటశాల కూడా బాగా ప్రోత్సహించారు. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించే సినిమాల్లో హీరో కాకుండా మిగిలిన పాత్రలకు పాటలు ఉన్నపుడు బాలూనే పిలిచి పాడించేవారు. అలా ఒక మారు ఘటసాల మ్యూజిక్ డైరెక్షన్లో ఒక పాటను బాలు పాడాల్సివుంది. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. బాలు చెన్నైలో ఒక చిన్న గదిలో అద్దెకు ఉండేవారు.

 

ఆ రోజు బాలూ బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తన ఇంటి గుమ్మం ముందు ఘంటశాల మాస్టర్ కూర్చుని కనిపించారుట. బాలు కంగారు పడిపోయి  ఇదేంటి మాస్టారు ఇలా నా ఇంటికి వచ్చి ఎంతసేపటిబట్టి ఉండిపోయారో అని నొచ్చుకున్నారుట. దానికి ఘంటశాల మాస్టారు  మరేం ఫరవాలేదు బాబూ  అనంటూనే  రేపు నా మ్యూజిక్ డైరెక్షన్లో పాట రికార్డింగ్ ఉంది. నీవు ఆ పాట పాడాలి. ఆ విషయం చెప్పిపోదామని వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయారుట.

 

నిజంగా అది ఘంటశాల మంచి మనసుకు, ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ఆలా బాలు ఇంటికే నేరుగా గానగంధర్వుడు విచ్చేసి అలనాటి బాల గాంధర్వుడు బాలుకే షాక్ ఇచ్చిన ఘటన ఇప్పటికీ బాలు తలచుకుంటారు. సందర్భం వస్తే పది మందికి ఘంటశాల గొప్పదనం గురించి ఒక  కధగా చెబుతూనే  ఉంటారు కూడా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: