ప్రస్తుతం నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 106 సినిమాని చేస్తున్నాడు. బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10 న ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మోనార్క్ అన్న టైటిల్ ని బోయపాటి ఫైనల్ చేశారని అదే టైటిల్ తో జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారని తాజా సమాచారం.

 

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో సినిమా చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చాలా కాలం తర్వాత భారీ సక్సస్ ని అందుకొని ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు పూరి. 

 

ఇక పూరి రాం తో తీసిన ఇస్మార్ట్ మాత్రం పూరి లోని స్టామినాని మరోసారి నిరూపించింది. ఈ సినిమా ఈ డేరింగ్ డైరెక్టర్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ ఊపుతో విజయ్ దేవరకొండ తో ఒక సినిమాని చేస్తున్నాడు. అయితే పాన్ ఇండియా సినిమాగా నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తో పాటు కొడుకుతో నిర్మిస్తున్న రొమాంటిక్ సినిమా మీద ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. దాంతో ఇంట్లో ఉన్న పూరి జగన్నాధ్ బాలయ్య కోసం కథ రాయడం అది ఒకే అవడం జరిగిపోయాయని తెలుస్తుంది. 

 

పూరి విజయ్ దేవరకొండ తో తీస్తున్న సినిమా అలాగే బాలయ్య బోయపాటి సినిమా కంప్లీట్ అవగానే పూరి బాలయ్య కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం పూరి-విజయ్, బాలయ్య-బోయపాటి సినిమాలు 2020 లో కంప్లీట్ చేస్తారని అంటున్నారు. ఈ రెండు పూర్తవగానే 2021 ప్రారంభంలో పూరి బాలయ్య సినిమా మొదలు పెట్టి 2021 దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ సారి పూరి బాలయ్య కోసం అద్భుతమైన కథ ని రాశాడని బ్లాక్ బస్టర్ ఖాయమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: