పి.వాసు దర్శకత్వంలో 2005వ సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో మరియు జ్యోతిక నటించిన ‘చంద్రముఖి’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పట్లో వేసవిలో రిలీజ్ అయిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లు సాధించి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటువంటి ఈ సినిమాకి తాజాగా సీక్వెల్ రెడీ చేయడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ‘చంద్రముఖి 2’ టైటిల్ పేరిట ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సినిమాలో  రాఘవ లారెన్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు...వార్తలు వైరల్ అవుతున్నయి.

IHG's ...

అంతేకాకుండా ఈ సీక్వెల్ లో ప్రధాన పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై సిమ్రాన్ క్లారిటీ ఇచ్చింది. వస్తున్న వార్తల్లో నిజం లేదని అవన్నీ రూమర్స్ అని తేల్చి చెప్పింది. ఏదైనా నిజం తెలుసుకుని వార్తలను రాయాలని కోరింది.

IHG

తమిళ్ మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ ఫస్ట్ మూవీతోనే ఉత్తమ నూతన నటి ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. అదే సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో 'అబ్బాయిగారి పెళ్లి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో అగ్రహీరోలగా ఉండే వారందరితో సిమ్రాన్ నటించడం జరిగింది. కాగా ‘చంద్రముఖి 2’ లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల లో నిజం కాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తాను కుటుంబ జీవితంతో ఎంతో సంతోషంగా ఉంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: